హీరోయిన్ ఖుష్భూ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బాలనటిగా కెరీర్ ప్రారంభించిన ఖుష్బూ విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన ‘కలియుగ పాండవులు’ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా ఖుష్బూకి తెలుగు, తమిళ భాషల్లో మంచి క్రేజ్‌ని తెచ్చిపెట్టింది. ఆ తరువాత స్టార్ హీరోయిన్‌గా ఎదిగిపోయింది
ఆ తరువాత నటనకు బ్రేక్ ఇచ్చింది. ఇటీవలే సెకండ్ ఇన్నింగ్స్ ఇచ్చిన ఖుష్బూ తెలుగులో పలు సినిమాల్లో నటించింది. ఇటీవలే ‘జబర్దస్త్’ షోకి జడ్జిగా కూడా వ్యవహరిస్తుంది. మరోపక్క పొలిటికల్ గా కూడా బిజీగా ఉంటోంది. ప్రస్తుతం ఖుష్భూ బీజేపీలో యాక్టివ్ గా ఉన్నారు. ఖుష్భూకి కీలక పదవి కూడా దక్కింది.
నేషనల్ ఉమెన్ కమిషన్ లో ఖుష్బూకి సభ్యురాలిగా అవకాశం వచ్చింది. ఇటీవలే భాద్యతలు కూడా తీసుకున్నారు. ఈ సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఖుష్భూ మహిళల గురించి మాట్లాడుతూ తన జీవితంలో జరిగిన సంచలన సంఘటనని పంచుకున్నారు. ఖుష్భూ తన తండ్రిపైనే చేసిన ఈ వ్యాఖ్యలు ప్రతి ఒక్కరికి షాక్ ఇస్తున్నాయి.
తనకి 8 ఏళ్ల వయసు ఉన్నప్పుడు తన తండ్రి కారణంగా ఆమె లైంగికంగా, శారీరకంగా వేధింపులు ఎదుర్కొన్నాట్లు తెలిపింది. అమ్మాయికి అయినా, అబ్బాయికి అయినా చిన్న తనంలోనే వేధింపులు ఎదురైతే జీవితం భయకంరంగా అనిపిస్తుంది. మా అమ్మ గురించి చెప్పాలంటే వివాహం చేసుకుని ఎంతో చిత్రవధ అనుభవించింది.
నాకు 8 ఎల్లా నుంచే మా నాన్న వల్ల వేధింపులు ఎదురయ్యాయి. ఆయన్ని ఎదిరించడానికి కావలసిన ధైర్యం నాకు 15 ఏళ్లకు వచ్చింది. ఈ విషయం మా అమ్మకి చెప్పినావు నమ్మేది కాదు. ఎందుకంటే ఆమె పతియే దైవం అని భావించే వాతావరణం లో పెరిగింది. ఏం జరిగినా, ఆయన ఏం చేసినా నా భర్త దేవుడు అనే భావనలో ఉండేది.
కానీ నా 15 ఏళ్ల నుంచి మా నాన్నపై తిరిగబడడం ప్రారంభించాను. నాకు 16 ఏళ్ళు ఉన్నప్పుడు నాన్న మరణించారు. అప్పుడు పూట గడవడం కూడా కష్టంగా ఉండేది అని తెలిపింది. ఖుష్భూ చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్‌గా మారాయి. ఖుష్బూ 2000లో.. తమిళ ప్రముఖ దర్శకుడు సుందర్‌ని వివాహం చేసుకుంది. వీరికి ఇద్దరు కుమార్తెలు సంతానం ఉన్నారు.
రావణాసుర టీజర్: రవితేజ హీరో నా.. విలన్‌నా!
హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు
శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు