మెగాస్టార్ చిరంజీవికు తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి అభిమానులు ఉంటారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రాజకీయాలకు అతీతంగా అభిమానులు ఉంటారు. నిత్యం విధులు నిర్వహించే పోలీసుల్లో కూడా చాలామంది మెగాస్టార్ చిరంజీవికి ఫ్యాన్స్ ఉన్నారు. చారిత్రాత్మక నేపధ్యం కలిగిన కథాంశంతో సినిమా తెరకెక్కింది. కర్నూలు జిల్లాలకు సంబంధించిన వీరుని కథ కావడంతో ఎలా ఉందొ చూడాలని అందరికి ఉంటుంది.
జిల్లాలోని కోవెలకుంట్లలో ఆరుగురు ఎస్సైలు సైరా సినిమా చూసేందుకు వేకువజామున థియేటర్లకు వెళ్లారు. విధుల్లో ఉండి… ఎవరికి చెప్పకుండా సినిమాకు ఎలా వెళ్తారు అని చెప్పి జిల్లా ఎస్పీ ఆ ఎస్సైలపై ఫైర్ అయినట్టు తెలుస్తోంది. ఆ ఆరుగురు ఎస్సైలపై చర్యలు తీసుకున్నట్టు తెలుస్తోంది. పాపం మెగాస్టార్ పై అభిమానంతో సినిమాకు వెళ్తే.. పై అధికారుల ఆగ్రహానికి గురికావాల్సి వచ్చింది.