సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘గుంటూరు కారం’. ఈ సినిమా నుండి మాస్ సాంగ్ రిలీజైంది. కుర్చీ మడతపెట్టి అంటూ సాగే ఈ హైఓల్టేజ్ సాంగ్ ఫుల్ లిరికల్ వీడియోను తాజాగా విడుదల చేసింది. నిన్న ఈ పాటకు సంబంధించిన ప్రోమోతోనే మహేశ్ అభిమానుల్లో భారీ హైప్ నెలకొంది. ఇప్పుడు పూర్తి పాట రావడంతో ఫ్యాన్స్ ఆనందానికి హద్దుల్లేకుండా పోయాయి.
ఈ పాటలో యంగ్ బ్యూటీ శ్రీలీలతో మహేశ్ బాబు ఉత్సాహంగా స్టెప్పులేశాడు. తమన్ సంగీతం అందించిన ఈ పాటకు రామజోగయ్యశాస్త్రి సాహిత్యం అందించారు. “రాజమండ్రి రాగమంజరి… మా అమ్మ పేరు తెలవనోళ్లు లేరు మేస్తిరీ… సోకులాడి స్వప్న సుందరీ… నీ మడతచూపు మాపటేల మల్లెపందిరీ” అంటూ ఆడియన్స్ ను కిర్రెక్కించేలా రామజోగయ్య తన కలానికి పనిచెప్పారు.
హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై మహేశ్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో వస్తున్న గుంటూరు కారం చిత్రం 2024 జనవరి 12న సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వస్తోంది.