మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా సురేంద్ర రెడ్డి దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా ‘దృవ’. ఈ సినిమా పాటలను నేరుగా మార్కెట్ లోకి విడుదల చేసిన చిత్రబృందం ప్రీరిలీజ్ ఫంక్షన్ ను మాత్రం గ్రాండ్ గా చేయాలని నిర్ణయించారు. డిసంబర్ 4న డేట్ కూడా ఖరారు చేశారు. యూసఫ్ గుడ్ పోలీస్ లైన్స్ లో జరగబోతోన్న ఈ కార్యక్రమానికి అతిథులుగా
పలువురు సినీరాజకీయ ప్రముఖులు రానున్నారు.
అయితే ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తనయుడు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ను ఆహ్వానించినట్లు తెలుస్తోంది. దానికి ఆయన కూడా అంగీకరించినట్లు సమాచారం. ఇటీవలే 10కె రన్ లో రామ్ చరణ్, కెటీఆర్ లు కలిసి సెల్ఫీలు తీసుకున్న సంగతి తెలిసిందే. డిసంబర్ 9న సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు!