KTR comments on Union Budget:
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎప్పటినుంచో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. 2019 ఎలక్షన్స్ లో కూడా వైసిపి విజయం కోసమే పోరాడారు. అయితే 2024లో ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు మొదలయ్యే సమయానికి తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీ అపోజిషన్ లో ఉంది. అందుకే ఆంధ్రప్రదేశ్లో అయినా జగన్ హయాం మళ్ళీ వస్తే బాగుంటుంది అని ఆశలు పెట్టుకున్నారు కేసీఆర్.
కానీ ఆసక్తికరంగా వైసిపికి పవర్ పక్కన పెడితే కనీసం ప్రతిపక్షం హోదా కూడా దక్కలేదు. ఇప్పుడు కెసిఆర్ కి తెలంగాణలో రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇద్దరూ శత్రువులు ఏర్పడ్డారు.
దీంతో బిఆర్ఎస్ పార్టీ వాడే అయినా కూడా కేటీఆర్ మాత్రం ప్లేటు మార్చేశారు. లోకల్ పార్టీ లకి మెజారిటీ ఇవ్వడం ముఖ్యమే అప్పుడే ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు లాగా ఎక్కువ ఫండ్స్ తీసుకోవచ్చు అని అన్నారు కేటీఆర్. దీంతో అది యూనియన్ బడ్జెట్ అనుకుంటున్నారా లేక ఆంధ్ర ప్రదేశ్ బడ్జెట్ అనుకుంటున్నారా అంటూ కొందరు కామెంట్లు చేశారు.
ఆంధ్రప్రదేశ్ శ్రీ ఆర్గనైజేషన్ ఆక్ట్ ప్రకారం ఆంధ్రప్రదేశ్కి ఎక్కువ ఫండ్స్ వచ్చాయి అని కానీ బడ్జెట్ విషయంలో తెలంగాణ గురించి అందరూ మర్చిపోయారు. తెలంగాణ కూడా విడిపోయిన రాష్ట్రాల్లో భాగమే అని గుర్తు చేశారు. అందుకే పవర్ లో లోకల్ పార్టీ లే ఉండాలి అని అన్నారు.
ఒకరకంగా చూస్తే కేటీఆర్ ఆంధ్రప్రదేశ్ ని, చంద్రబాబు నాయుడుని పొగిడినట్టే. కానీ నిన్న మొన్నటిదాకా జగన్ గెలవాలి అంటూ కామెంట్లు చేసిన టిఆర్ఎస్ లీడర్లు ఇప్పుడు టిడిపికి మద్దతుగా మాట్లాడుతూ ఉండడం ప్రజలను సైతం షాక్ కి గురిచేస్తోంది.