తెలంగాణ మంత్రి కేటీఆర్ టీఆర్ఎస్ పాలన రాకముందు కరెంటు వస్తే వార్త అని.. టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చాక కరెంటు పోతే వార్త అని అన్నారు. ఇవాళ బాలనగర్ రోడ్‌షోలో ఆయన మాట్లాడుతూ నాలుగున్నరేళ్లలో 4,600 కోట్ల అభివృద్ధి పనులు చేశామని అన్నారు. వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పినట్లు కలలో కూడా ఊహించని మార్పులు జరుగుతున్నాయని.. అందుకు ఉదాహరణే బాబు-రాహుల్‌ల కలయిక అని అన్నారు. పొరపాటున ప్రజాకూటమి అధికారంలోకి వస్తే ఏదైనా పనికావాలంటే అమరావతి పోవాలని కేటీఆర్ అన్నారు.
‘కేసిఆర్ ఓడించేంత వరకు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి గడ్డం తీయరట. ఆయన గడ్డం తీయకపోతే ఎవరికి నష్టం. గడ్డం ఉన్నవాళ్లంతా గబ్బర్‌సింగ్ అవ్వాలంటే ఎలా?’ అని ఎద్దేవా చేశారు. అంతకముందు కూకట్‌పల్లిలో జరిగిన సభలో కేటీఆర్ మాట్లాడుతూ నందమూరి కుటుంబం మీద చంద్రబాబుకు అంత ప్రేమ ఉంటే లోకేష్‌ను ఏపీలో మంత్రిని చేసినట్టుగా నందమూరి సుహాసినిని అక్కడే మంత్రిని చేయొచ్చుగా? అని ప్రశ్నించారు. ఒకవేళ తెలంగాణలో తెలుగుదేశం పాగా వేయాలన్న ఆలోచన చంద్రబాబుకు ఉంటే.. లోకేష్‌ను ఇక్కడ పోటీకి దింపొచ్చు కదా అని కేటీఆర్ ప్రశ్నించారు.