తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ జనాల్లోనూ చాలా సరదాగా కలిసిపోతారు. సామాజిక మాధ్యమాల్లో కూడా చాలా ఎక్టివ్గా ఉంటారు. ఆయన మాటల ప్రవాహం, ప్రజలతో కలివిడితనం ఎలా ఉంటుందో ఎన్నికల ప్రచారంలో అందరం చూశాం. ఎన్నికల సమయంలోనే కాదు, కరోనా మహమ్మారి పట్టిపీడిస్తున్న నేటి భయానక పరిస్థితుల్లోనూ ప్రజల్లో తిరుగుతూ కరోనాపై అవగాహన కల్పిస్తూ, జాగ్రత్తలు చెబుతూ, అందుతున్న సౌకర్యాలను నేరుగా అడిగి తెలుసుకుంటున్నారు. .
వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తున్న కేటీఆర్ ఓ ఇంటి వద్ద ఓ మహిళకు జాగ్రత్తలు చెబుతూ, ఆమె కుమారుడి పేరు అడిగ్గా, ‘రామ్చరణ్’ అంటూ బదులిచ్చాడు ఆ బాలుడు. దీంతో కేటీఆర్ ‘సినిమాలో రామ్చరణ్ తెలుసా’ అంటూ అడగటంతో నవ్వులు పూశాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇటీవల డైరెక్టర్ రాంగోపాల్ వర్మకు కూడా కేటీఆర్ తనదైన శైలిలో సమాధానం ఇచ్చిన సంగతి తెలిసిందే.
#KTR interaction with people making awareness #StayHome till May3#lockdown pic.twitter.com/4nRze9umPp
— Sai kumar (@saikumar_8007) April 16, 2020