Homeతెలుగు వెర్షన్ప్రధానిగా కేటీఆర్.. కేసీఆర్ ప్లాన్ అదిరింది !

ప్రధానిగా కేటీఆర్.. కేసీఆర్ ప్లాన్ అదిరింది !

KTR as Prime Minister. KCRs plan is here

సీఎం కేేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ పెట్టిందే.. దేశ ప్రధాని కావడానికి అని ప్రచారం జరుగుతుంది. కేసీఆర్ అంత అమాయకుడు ఏమీ కాదు. కేసీఆర్ కి వాస్తవ పరిస్థితుల పై ఎంతో అవగాహన ఉంటుంది. మహా అయితే, తాను మళ్లీ కష్టపడితే మళ్ళా ఇంకో టెర్మ్ ముఖ్యమంత్రి కావచ్చు. ఈ విషయంలో కేసీఆర్ కి పూర్తీ అవగాహన ఉంది. పైగా కేసీఆర్ ప్రాంతీయ నాయకుడు. అన్నిటికీ మించి గతంలో, అలాగే పోయినసారి ఎన్నికల్లో ఆంధ్ర వాళ్ళను ఎన్ని బూతులు తిట్టాలో అన్నీ బూతులు తిట్టిన నాయకుడు. అపర చాణక్యుడు అయిన కేసీఆర్ కి ఇది గుర్తు ఉండకుండా ఎందుకు ఉంటుంది ?.

పైగా, ఉత్తర భారతదేశం వాళ్ళు “రండి, కేసీఆర్ గారు, మీరు ప్రధానమంత్రి కాండి, మమ్మల్ని పరిపాలించండి” అని ఆహ్వానించేంత సీన్ లేదు. ఈ విషయంలో కూడా కేసీఆర్ కి క్లారిటీ ఉంది. మొత్తంగా కేసీఆర్ కి ప్రధాన మంత్రి అయ్యే ఛాన్స్ లేదని ఆయనకు బాగా తెలుసు. మరెందుకు కేసీఆర్ బీఆర్ఎస్ పెట్టాడు. బీఆర్ఎస్ పార్టీ వ్యూహం వెనుక ప్రధానమంత్రి కావాలనే వ్యూహం కాకుండా, మరో వ్యూహం ఉంది. ఆ వ్యూహ ఫలితమే.. కేటీఆర్ పట్టాభిషేకం.

నాణేనికి రెండో పక్క స్టోరీ ఇది. కేసీఆర్ అబ్బాయిగా కంటే.. కేటీఆర్ కి చాలా సమర్ధుడు అని పేరు ఉంది. పైగా కేటీఆర్ లో నాయకత్వ లక్షణాలు ఉన్నాయి. అద్భుతమైన కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయి. అందులోనూ కేటీఆర్ యువకుడు. రాజకీయపరంగా చూస్తే కాస్త ముదిరిన యువకుడు. రాబోయే కాలంలో బలమైన నేతగా ఎదిగే అవకాశం ఉన్న రాజకీయ నాయకుల్లో కేటీఆర్ ఒకరు. దానికి తగ్గట్టుగానే హైదరాబాద్ మహానగరాన్ని కేటీఆర్ ఉరుకులు పరుగులు పెట్టిస్తున్నారు. అభివృద్ధి పథంలో హైదరాబాద్ దూసుకు పోతోంది. పెట్టుబడులు గంగా ప్రవాహంలా వస్తున్నాయి.

పై విషయాలను కేసీఆర్ నేషనల్ వైడ్ గా ప్రచారం చేస్తున్నారు. హైదరాబాద్ అభివృద్ధి అయినట్టే.. ఇండియా కూడా అవుతుంది అని భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీ ప్రచారం చేసుకోవచ్చు. పనిలో పనిగా ప్రధాని అభ్యర్థిగా కేటీఆర్ పేరును తెరపైకి తీసుకురావొచ్చు. అయితే, ఇది జరగడానికి మరో ఇరవై ఏళ్ళు పట్టొచ్చు. ఇది కేసీఆర్ ప్లాన్. కొడుకును సీఎం చేయడానికి ఇప్పటికే రంగం సిద్ధం చేసుకున్న కేసీఆర్, రానున్న రోజుల్లో ప్రధాని కావడానికి కూడా స్కెచ్ వేశారు. పైగా కేటీఆర్ ప్రధాని కావడం కేసీఆర్ కోరిక అని తెలుస్తోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu