ప్రముఖ సినీ దర్శకుడు కేఎస్ సేతు మాధవన్ శుక్రవారం ఉదయం చెన్నైలో కన్నుమూశారు. 90 ఏళ్ల ఈ దర్శకుడు చాలా కాలంగా వృద్ధాప్య సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారు. 1961లో మలయాళంతో డైరెక్టర్‌గా కెరీర్ స్టార్ట్ చేసిన ఆయన తమిళ, కన్నడ, హిందీ భాషల్లో 60కిపైగా చిత్రాలను తెరకెక్కించారు. ఇక తెలుగులో 1995లో వచ్చిన స్త్రీ సినిమాను డైరెక్ట్ చేశారు సేతు మాధవన్.
కేరళలోని పాలక్కడ్‌లో 1931లో జన్మించిన ఆయన పూర్తి పేరు కే. సుబ్రహ్మణ్యం సేతు మాధవన్. ఆయనకు భార్య వల్సాల, పిల్లలు సోను కుమార్, ఉమ, సంతోష్ సేతు మాధవన్ ఉన్నారు. 1991లో మరుపక్కమ్ అనే తమిళ సినిమాకు ఉత్తమ దర్శకుడిగా అవార్డు అందుకున్నారు. కె. ఎస్ సేతుమాధవన్ 1962 మలయాళ చిత్రం ‘కన్నుమ్ కరాలుమ్’ లో కమల్ హాసన్‌ను చైల్డ్ ఆర్టిస్ట్‌గా పరిచయం చేశారు. దర్శకుడు కేఎస్ సేతు మాధవన్ సినిమాలకు చేసిన కృషికి గానూ 10 జాతీయ చలనచిత్ర అవార్డులు, 9 కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డులు వరించాయి.
காலத்தால் அழியாத காவியங்களைத் திரையில் படைத்த கே.எஸ்.சேதுமாதவன் புதிய அலை சினிமாவின் ஊற்றுமுகம்.மலையாள சினிமாவின் தரத்தைத் தீர்மானித்த அடிப்படை விசைகளுள் ஒருவர்.தன் கலைச்சாதனைகளால் என்றென்றும் நினைவு கூரப்படுவார்.என் சேது சாருக்கு, நல்ல சினிமாவை கற்பித்த ஆசிரியருக்கு அஞ்சலிகள். pic.twitter.com/CXPcyVuMDA
— Kamal Haasan (@ikamalhaasan) December 24, 2021