తొలి సినిమా ‘ఉప్పెన’ ప్రేక్షకులను ఆట్టుకుంది కృతిశెట్టి. దీంతో ఈమెకు వరుస ఆఫర్‌లు వస్తున్నాయి. టాప్ స్టార్స్ మొదలుకొని స్టార్ డైరెక్టర్ల చూపు ఈ ముద్దుగుమ్మపై పడింది. ఈ నేపథ్యంలోనే కృతిశెట్టి పర్ఫార్మెన్స్ చూసి ఫిదా అయిన నాగార్జున.. ఆమెకు బంపర్ ఆఫర్ ఇచ్చారనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అక్కినేని నాగార్జున- కళ్యాణ్ కృష్ణ కురసాల కాంబోలో గతంలో వచ్చిన రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ‘సోగ్గాడే చిన్నినాయనా’ సీక్వల్‌గా రాబోతున్న ‘బంగార్రాజు’ మూవీలో కృతిశెట్టి హీరోయిన్‌గా నటిస్తుందట. గత కొన్ని నెలలుగా ఈ సినిమా గురించిన చర్చలు నడుస్తున్నప్పటికీ ఇంకా సెట్స్ మీదకు రాలేదు. దీంతో అతిత్వరలో సెట్స్ మీదకు రావాలని ఫిక్స్ అయిన నాగార్జున ఇందులో ఓ హీరోయిన్‌గా కృతిశెట్టి పేరును రిఫర్ చేశారని తెలుస్తోంది.
ఈమూవీలో నాగచైతన్య కూడా భాగమవుతున్నారు. అయితే ఈ చిత్రంలో నాగార్జున సరసన రమ్యకృష్ణ నటించనుండగా.. నాగ చైతన్య జంటగా కృతిశెట్టి నటించనుందని అంటున్నారు. ఇప్పటికే ఈ పాత్ర కోసం కొందరు హీరోయిన్లను పరిశీలించిన టీమ్.. నాగార్జున సూచన మేరకు కృతిశెట్టి వైపు మొగ్గు చూపుతున్నారట. అతిత్వరలో ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు నాని హీరోగా తెరకెక్కుతున్న ‘శ్యామ్ సింగరాయ్’ సినిమాతో బిజీగా ఉన్న కృతి
శెట్టి.. ఎనర్జిటిక్ స్టార్ రామ్‌కి జోడీగా మరో సినిమాకు సైన్ చేసింది. దీంతో పాటు యంగ్ హీరో నితిన్ సరసన మరో సినిమాలో ఆమెను ఫైనల్ చేశారని తెలుస్తోంది.