HomeTelugu Newsనామీద నాకే అనుమానం వచ్చింది: కృతిసనన్‌

నామీద నాకే అనుమానం వచ్చింది: కృతిసనన్‌

15 8

టాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ మహేశ్‌ బాబు హీరోగా తెరకెక్కిన చిత్రం ‘1 నేనొక్కడినే’. చిత్రంతో వెండితెరకు పరిచయమైన ఆమె ఆ తర్వాత బాలీవుడ్‌ సినిమాలతో బిజీగా ఉన్నారు. తాజాగా కృతిసనన్‌ ఓ బాలీవుడ్‌ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎన్నో ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

‘ముంబయికి వచ్చిన కొత్తలో నాకు ఇక్కడ ఎవరూ తెలియదు. సినిమాల్లోకి వెళ్లాలంటే ఏం చేయాలి, ఎవర్నీ కలవాలి అనే విషయాలు కూడా నాకు తెలియదు. ఆ తర్వాత ఒక ఏజెన్సీ వల్ల సినీ ఇండస్ట్రీలోకి నా ప్రయాణాన్ని ఆరంభించాను. ముంబయికి వచ్చాక నేను ఎన్నో విషయాలు తెలుసుకున్నాను. ఏదో ఒక విషయంలో ఎవరో ఒకరు నిన్ను జడ్జ్‌ చేస్తూనే ఉంటారు. ఇలా ఉండు, అలా ఉండు అని నీకు చెబుతూనే ఉంటారు. కాబట్టి పరిస్థితులకు తగ్గట్టు లుక్స్‌, డ్రెస్సింగ్‌ మార్చుకోవాలని అర్థమైంది. మీటింగ్స్‌ కోసం మంచి దుస్తులు తీసుకుందామని నా మేనేజర్‌తో ఓసారి కలిసి మాల్‌కు వెళ్లాను. అక్కడికి వెళ్లాక.. డ్రెస్సింగ్‌ సరిగ్గా లేకపోవడం వల్లే చాలామంది నన్ను ఇష్టపడడం లేదనిపించింది. మన లుక్స్‌, డ్రెస్సింగ్‌ వల్ల కొన్నిసార్లు మన మీద మనకే అనుమానం వస్తుంది. నాకు కూడా అలాంటి అనుమానమే వచ్చింది. అలాంటి సమయంలో.. నువ్వు నీ మేకప్‌ స్టైల్‌ను మార్చుకో, నీ పెదవులకు లైనర్‌ వాడు అని ఒకరు నాతో చెప్పారు. నాకు వేరే అవకాశం వస్తుందో రాదో అనే భయంతో నా చేతితో ఉన్న ఆఫర్‌ అంత గొప్పది కాకపోయినా నటించాలనిపించింది. అయితే స్టార్‌కిడ్స్‌కు మాత్రం మొదటి సినిమా విడుదల కాకముందే రెండో సినిమాకి అవకాశం వస్తుంది. కానీ మేము మాత్రం నటించిన సినిమాలతోనే మాలోని కళను నిరూపించుకోవాల్సి ఉంటుంది.’ అని కృతిసనన్‌ తెలిపారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!