టాలీవుడ్‌లో ‘ఉప్పెన’ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన మంగళూరు బ్యూటీ కృతిశెట్టి. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్‌ను సొంతం చేసుకున్న ఈ భామ ఆ తర్వాత శ్యామ్ సింగ రాయ్, బంగార్రాజు సినిమాలతో హ్యాట్రిక్ హిట్ కొట్టేసింది. దీంతో ఈ బ్యూటీకి వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. ప్రస్తుతం బేబమ్మ చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీ అయిపోయింది. ఇటీవల ‘ది వారియర్’ మూవీతో ప్రేక్షకులను పలకరించిన ఆమె తొలి ఫ్లాప్ చవి చూసింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ ద్విభాష చిత్రం డిజాస్టర్‌గా నిలిచింది.
అయితే ఇప్పుడు ‘ది వారియర్’ ఫ్లాప్‌తో ఆమెను విమర్శిస్తున్నారు. ఇందులో తన లుక్ అంతగా బాగోలేదని పలువురు కృతికి సూచించారట. దీంతో తన అందాన్ని మరింత మెరుగు పరుచుకునేందు ‘బేబమ్మ’ సర్జరీకి సిద్దమైందట. తన పెదాల పరిమాణాన్ని తగ్గించుకునేందుకు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోవాలని నిర్ణయం తీసుకున్నట్లు సన్నిహితవర్గాల నుంచి సమాచారం. ఇందుకోసం ఇప్పటికే ఓ ఫేమస్ డాక్టర్‌ను సంప్రదించి సలహా కూడా తీసుకుందని టాక్.