HomeTelugu Big Storiesప్రభాస్ ను పెళ్లి చేసుకుంటాను: కృతిసనన్‌

ప్రభాస్ ను పెళ్లి చేసుకుంటాను: కృతిసనన్‌

kriti sanon says I will mar
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రభాస్‌ రాముడిగా నటిస్తున్న చిత్రం ‘ఆదిపురుష్’. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ క్రమంలో ప్రభాస్, కృతి సనన్‌ ప్రేమలో ఉన్నట్టు బాలీవుడ్ సర్కిల్ లో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఈ సినిమా షూటింగ్ లోనే ఇద్దరి మధ్య ప్రేమాయణం మొదలైందని అంటున్నారు. తాజాగా ఈ అంశంపై కృతి స్పందించింది.

ఒకవేళ ఛాన్స్ వస్తే ప్రభాస్ ను పెళ్లి చేసుకుంటానని కృతి చెప్పింది. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్ గా మారాయి. ఇంకోవైపు బాలీవుడ్ హీరో వరుణ్ ధావణ్ కూడా ఈ అంశంపై మాట్లాడుతూ… ప్రభాస్ జీవితంలో కొత్త డార్లింగ్ ఉందని అన్నారు. ప్రభాస్, కృతి ఇద్దరిదీ అందమైన జంట అని కితాబునిచ్చాడు. గతంలో అనుష్క శెట్టి, ప్రభాస్ లు పెళ్లి చేసుకోబోతున్నారంటూ చాలా కాలంపాటు గతంలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

Recent Articles English

Gallery

Recent Articles Telugu