1 నేనొక్కడినే చిత్రంతో సినీ రంగానికి పరిచయమయిన నటి కృతిసనన్. ఆ తరువాత దోచేయ్ సినిమాలో కూడా నటించింది. ఈ రెండు సినిమాలతో అమ్మడుకి పెద్దగా కలిసొచ్చిందేమీ లేదు. బాలీవుడ్ లో కూడా షారూఖ్ ఖాన్ తో కలిసి సినిమాలో నటించింది. కానీ అమ్మడుకు అవకాశాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. అయితే సినిమా వార్తల కంటే కృతి తన డేటింగ్ విషయంతో తరచూ వార్తల్లో నిలుస్తుంది.
చాలా రోజులుగా కృతి సనన్ హీరో సుశాంత్ రాజ్ పుత్ తో కలిసి సహజీవనం చేస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. వీరిద్దరు కలిసి ఓ సినిమాలో నటించారు కూడా. ఆ సమయంలోనే ఈ వార్తలు మొదలయ్యాయి. కానీ ఏనాడూ కూడా వీరిద్దరు ఆ వార్తలను ఖండించే ప్రయత్నం చేయలేదు. సినిమా పూర్తయిన కూడా ఇప్పటికీ వీరిపై వార్తలు రావడం ఆగడం లేదు. అసలు విషయం ఏమిటంటే.. ఇప్పటికీ వీళ్ళిద్దరూ కలిసే ఉంటున్నారని బాలీవుడ్ మీడియా ప్రచురిస్తోంది.