దగ్గుబాటి సురేష్ బాబు రెండవ తనయుడు అభిరామ్ ఎంట్రీ ఇవ్వనున్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఎట్టకేలకు డైరెక్టర్ తేజ దర్శకత్వంలో అభిరామ్ హీరోగా సినిమా చేసేందుకు సిద్దం అయ్యాడు అంటూ వార్తలు వస్తున్నాయి. సురేష్ బాబు నిర్మించబోతున్న ఈ సినిమా కోసం తేజ ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా మొదలు పెట్టారట. ఈ సినిమా కోసం దర్శకుడు తేజ ఉప్పెన బేబమ్మ కృతి శెట్టిని సంప్రదించగా నో చెప్పిందంటూ టాక్.
మెగా హీరో ‘ఉప్పెన’ తొలి సినిమా తో ఒక్క సారిగా స్టార్ హీరోయిన్ గా మారిపోయింది కృతి శెట్టి. ఇప్పటికే తెలుగులో ఈ ముద్దుగుమ్మ మూడు నాలుగు సినిమా లను కమిట్ అవ్వడంతో పాటు తమిళంలో కూడా ఒకటి రెండు సినిమా లు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇంత బిజీగా ఉండటం వల్లే అభిరామ్ కు జోడీగా నటించేందుకు కృతి నో చెప్పి ఉండవచ్చు అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కొందరు మాత్రం కృతి శెట్టి ఎంత బిజీగా ఉన్నా కూడా ఒక పెద్ద కుటుంబంకు చెందిన హీరోకు ఎలా నో చెబుతుంది అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కృతికి అభిరామ్ తో వర్క్ చేయడం ఇంట్రెస్ట్ లేక పోవడం వల్లే నో చెప్పి ఉంటుందేమో అంటున్నారు. ఆ ప్లేస్లో కొత్తమ్మాయిని ఎంపిక చేసేందుకు తేజ ప్రయత్నాలు చేస్తున్నాడు. వచ్చే ఏడాదికి సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయంటూ ఇండస్ట్రీ వర్గాల ద్వారా తెలుస్తోంది. అయితే అభిరామ్.. తేజల మూవీ ఇప్పటి వరకు అధికారికంగా ఎలాంటి కన్ఫర్మేషన్ రాలేదు.