కోలీవుడ్ ప్రముఖ నటుడు సూర్య- స్టార్ డైరెక్టర్ బాలా కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్‌లో ‘నంద’, ‘పితామగన్’ వంటి సినిమాలు వచ్చాయి. దాదాపు 18 ఏళ్ల తర్వాత మళ్లీ వీరిద్దరూ కలిసి పనిచేస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించని షూటింగ్ సోమవారం కన్యాకుమరిలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది.
సూర్య కెరీర్‌లో 41వ చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ చిత్రంలో సూర్య చెవిటిగాను, మూగవాడిగాను నటిస్తున్నట్లు టాక్ వినిపిస్తుంది. ఇక సూర్యకు జోడీగా కృతిశెట్టి నటిస్తుంది. జ్యోతిక, సూర్య సమర్పణలో వారికి చెందిన 2డీ ఎంటర్‌టైన్స్‌మెంట్ బ్యానర్‌లో ఈ చిత్రం రూపొందుతుంది. జీవీ ప్రకాశ్ కుమార్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.