HomeTelugu Trendingకృతీ శెట్టి బాలీవుడ్‌ ఎంట్రీ...

కృతీ శెట్టి బాలీవుడ్‌ ఎంట్రీ…

Krithi shetty bollywood ent

టాలీవుడ్‌లో వరుస అవకాశాలతో బిజీగా ఉన్న హీరోయిన్‌ కృతీ శెట్టికి బాలీవుడ్‌ నుంచి పిలుపు వచ్చింది అనే వార్తలు వినిపిస్తున్నాయి. నాని హీరోగా, కృతీ శెట్టి, సాయిపల్లవి హీరోయిన్స్‌గా నటించిన చిత్రం ‘శ్యామ్‌ సింగరాయ్‌’. రాహుల్‌ సంకృత్యాన్‌ డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమా గత ఏడాది డిసెంబరు 24న విడుదలై మంచి విజయం సాధించింది. కాగా ఈ చిత్రం హిందీలో రీమేక్‌ కానుందని బాలీవుడ్‌ టాక్‌. ఇందులో షాహిద్‌ కపూర్‌ హీరోగా నటించనున్నారట.

ఒరిజినల్‌లో కృతీ శెట్టి చేసిన పాత్రనే హిందీ రీమేక్‌లోనూ చేయాలని షాహిద్‌ అండ్‌ కో ఆమెను సంప్రదించారట. హిట్‌మూవీకి రీమేక్‌ కావడం, పైగా షాహిద్‌ వంటి స్టార్‌తో బాలీవుడ్‌ ఎంట్రీ వంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని కృతి గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారని టాక్‌. ఈ విషయాలపై అధికారిక సమాచారం అందాల్సి ఉంది.

పునీత్ చివరి సినిమా చుస్తూ.. అభిమాని మృతి

Recent Articles English

Gallery

Recent Articles Telugu