టాలీవుడ్‌లో ‘ఉప్పెన’ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ కృతి శెట్టి. ఈ సినిమాతో మంచి క్రేజ్ తెచ్చుకున్న ఈ బ్యూటీకి వరుస అవకాశలు వచ్చాయి. కానీ ఆ ఫేమ్ ఎక్కువ రోజులు నిలవలేదు. ప్రస్తుతం టాలీవుడ్ లో ఆమెకు పెద్దగా ఆఫర్లు లేవు. అయితే తమిళ్, కన్నడ, మలయాళం భాషల్లో మాత్రం కృతికి అవకాశాలు ఎక్కువే వస్తున్నాయి.
ఇదిలా ఉంటే.. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే ఈ బ్యూటీ తాజాగా షేర్ చేసిన ఒక వీడియో సోషల్ మీడియాని ఓఊపు ఊపేస్తుంది.వరుస ఫోటోషూట్స్ షేర్ చేస్తున్న కృతి శెట్టి.. ఈసారి బెల్లీ డాన్స్ వీడియో షేర్ చేసింది.
విజయ్ బీస్ట్ సినిమాలోని అరబిక్ కుతు పాటకు స్నేహితురాలితో కలిసి బెల్లీ డాన్స్ అదరగొట్టేసింది. ఎంతో సింపుల్ స్టెప్స్ వేస్తూ మెస్మరైజ్ చేసింది. అందంతోపాటు.. ఈ బ్యూటీ టాలెంట్ చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుంది. దీంతో కృతిపై నెటిజన్లు ప్రశంసలు చేస్తున్నారు.
View this post on Instagram