HomeTelugu Trendingరామ్‌తో డాన్స్‌ అనేసరికి భయం వేసింది: కృతిశెట్టి

రామ్‌తో డాన్స్‌ అనేసరికి భయం వేసింది: కృతిశెట్టి

Krithi shetty about ram pot
టాలీవుడ్ యంగ్ హీరోయిన్‌ కృతి శెట్టికి మంచి ఫాలోయింగ్‌ ఉంది. ఇప్పటికే హ్యాట్రిక్ హిట్ కొట్టిన ఈ బ్యూటీ.. ఈ ఏడాదిలో మరో మూడు సినిమాలతో ప్రేక్షకులను పలకరించనుంది. ఆ సినిమాలలో ముందుగా థియేటర్లకు రావడానికి ‘ది వారియర్’ సినిమా ముస్తాబవుతోంది. రామ్ జోడీగా కృతి శెట్టి నటించిన ఈ సినిమా, ఈ నెల 14న విడుదల కానుంది.

తాజా ఇంటర్వ్యూలో కృతి శెట్టి మాట్లాడుతూ .. “లింగుసామి గారి ‘ఆవారా’ సినిమా అంటే నాకు చాలా ఇష్టం. ఆయన నుంచి కాల్ రాగానే నా ఆనందం అంతా ఇంతా కాదు. ఇక రామ్ డాన్స్ గురించి నాకు తెలుసు .. ఆయన స్పీడ్ ను అందుకోవడం కష్టమని చాలామంది చెప్పారు కూడా. ఆయనతో సీన్స్ ఈజీగానే చేశానుగానీ, పాటలనేసరికి భయం వేసింది.

నిజంగానే రామ్ ఎనర్జీ లెవెల్స్ చూసి కంగారుపడిపోయాను. మొత్తానికి ఏదో ఫ్లోలో మ్యాచ్ చేయగలిగాను. ఇక ఆది పినిశెట్టి ఈ సినిమాలో విలన్ గా చేశారు. మా కాంబినేషన్లో సీన్స్ లేవు కానీ, సినిమా చూసిన తరువాత షాక్ అయ్యాను. చాలా కూల్ గా కనిపించే ఆయననేనా తెరపై కనిపిస్తున్నది అనుకున్నాను” అంటూ చెప్పుకొచ్చింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu