HomeTelugu Trendingనాకు ఓ కూతురు ఉంది.. రేప్ కేసుపై హీరో కృష్ణుడు స్పందన

నాకు ఓ కూతురు ఉంది.. రేప్ కేసుపై హీరో కృష్ణుడు స్పందన

Krishnudu respond on rape cనల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన 25 ఏళ్ల దళిత యువతి హైదరబాబ్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది. 139 మంది పదేళ్లుగా తనపై అత్యాచారం చేశారని ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. ఆ కేసును పంజాగుట్ట నుంచి సీసీఎస్ కు బదిలీ చేశారు. 139 మంది నిందితులకు సీసీఎస్ పోలీసులు నోటీసులు జారీ చేయనున్నారు. అందులో యాంకర్ ప్రదీప్ మాచిరాజుతో పాటు నటుడు కృష్ణుడుతో పాటు ఓ మీడియాతో పాటు రాజకీయ నాయకులు పలువురు తనపై అత్యాచారం చేసారని ఫిర్యాదులో పేర్కొనడం సంచలనంగా మారింది. తనపై కొన్నేళ్లుగా ఈ అత్యాచారాలు జరుగుతున్నాయని చెప్పడం ఆసక్తిగా మారింది. పదేళ్లుగా తనను వేధిస్తున్నారని.. తనపై 139 మంది అత్యాచారం చేశారని తనే స్వయంగా కంప్లైంట్ ఇవ్వడంతో ఈ కేసుపై పోలీసులు కూడా ప్రత్యేక దృష్టి సారించారు.

అయితే… ఈ కేసు విషయమై నటుడు కృష్ణుడు స్పందించాడు. ఆయన మాట్లాడుతూ.. నాకు ఈ వార్త తెలియగానే షాక్ అయ్యాను. నేను సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన తరువాత హీరోగా, ఆర్టిస్ట్‌ చాలామందితో కలిసి పనిచేశాను. ఎప్పుడూ కూడా నాపై ఆరోపణలు లేవు. నాకు ఎలాంటి చెడు అలవాట్లు లేవు. అలాంటి నాపై రేప్ ఆరోపణలు రావడం షాక్‌లోకి వెళిపోయా. ఈ విషయం నా భార్యకి చెప్పాను. నేను డిప్రెషన్‌లోకి వెళ్లిపోవడంతో నా భార్య.. నీ గురించి నాకు తెలుసు అని చెప్పింది. మా ఫాదర్ రీసెంట్‌గా చనిపోయారు… ఊర్లో అమ్మ ఒక్కరే ఉన్నారు. వాళ్లందరిపై ఈ ఆరోపణలు ఎంత ఎఫెక్ట్ చూపిస్తాయని ఆలోచించాలి. ఒకరిపై ఆరోపణలు చేసేటప్పుడు ఇంకే ఆలోచించరా?? మా ఇంట్లో ఆడవాళ్లు ఉన్నారు.. నాకు కూతురు ఉంది.. ఆధారాలు లేకుండా మీ ఇష్టం వచ్చినట్టు ఆరోపణలు చేసేసి.. లబ్ధి పొందాలనుకుంటే ఈ ప్రభావం రేపటి రోజున చాలామందిపై పడుతుంది.

Krishnudu respond on rape a

ఈ ఆరోపణల్ని ఖండిస్తున్నా.. ఈ కేసుతో నాకు ఎలాంటి సంబంధాలు లేవు. నాపై ఆరోపణలు వచ్చాయి కాబట్టి.. ఇది నా పరువుకి సంబంధించిన విషయం కాబట్టి దీని వెనుక ఎవరున్నా యాక్షన్ తీసుకుంటా. ఆ అమ్మాయి ఎవరో కూడా నాకు తెలియదు. ప్రసాద్ అనే ఫ్రెండ్ నాకు ఉన్నట్టు అందరికీ తెలుసు. స్టుడియోకి అతనికి ఏం సంబంధం లేదు. ఆమె చేసే ఆరోపణలు అన్నీ తప్పే. ప్రసాద్ కూడా ఈ విషయాన్ని విని షాక్ అయ్యాడు. అతను కూడా కులాంతర వివాహం చేసుకుని ఇద్దరు పిల్లలతో ఉన్నాడు. దీని వెనుకాల ఎవరో ఉన్నారు. కావాలని ఆడిస్తున్నారు. నేను లవ్ మ్యారేజ్ చేసుకున్నా.. నాకు ఓ కూతురు ఉంది.. మా భార్యను నిర్మాతగా పెట్టి సినిమా కూడా మొదలుపెట్టా. నేను మహిళలకు ఎంత గౌరవం ఇస్తానో ఇండస్ట్రీలో ఉన్న అందరికీ తెలుసు. నాకు జరిగిన అన్యాయం మరొకరికి జరగకూడదు. ఖచ్చితంగా ఈ కేసులో బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటా.. లీగల్‌గా ముందుకు వెళ్తా అంటూ హీరో కృష్ణుడు చెప్పుకొచ్చాడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu