ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ కరాళనృత్యం చేస్తుంది. ఈ నేపథ్యంలో అందరి దృష్టి వ్యాధి నిరోధక శక్తి పెంచుకోవడం ఎలా అనే అంశంపై పడింది. ప్రముఖ సీనియర్ నటుడు, బీజేపీ నేత కృష్ణంరాజు దీనిపై స్పందిస్తూ.. ఇమ్యూనిటీ పెంచుకునేందుకు యోగాలో అనేక ఆసనాలు ఉన్నాయని తెలిపారు. తన అర్ధాంగి శ్యామలాదేవితో కలిసి పలు ఆసనాలు వేసి చూపించారు. ఈ మేరకు ఓ వీడియో విడుదల చేశారు. రేపు (జూన్ 21) ప్రపంచ యోగా దినోత్సవం కావడంతో కృష్ణంరాజు ఈ వీడియో రూపొందించారు. యోగాతో మనశ్శాంతిగా ఉండడమే కాదని, కరోనా వంటి ప్రమాదకర వైరస్‌ల నుంచి రక్షించుకోవడానికి అవసరమైన వ్యాధి నిరోధక శక్తి కూడా పెరుగుతుందని వివరించారు. ప్రాణక్రియ, కపాలభాతి అనే యోగా ప్రక్రియలను కృష్ణంరాజు దంపతులు ప్రదర్శించారు.