HomeTelugu TrendingPrabhas Wedding: ప్రభాస్ పెళ్లి విషయంలో కూడా అదే అవుతుంది అంటున్న శ్యామలా దేవి

Prabhas Wedding: ప్రభాస్ పెళ్లి విషయంలో కూడా అదే అవుతుంది అంటున్న శ్యామలా దేవి

Prabhas wedding
Krishnam Raju’s wife gives clarity on Prabhas Wedding

Prabhas Wedding:

ప్రముఖ సెలబ్రిటీ జ్యోతిష్యుడు వేణు స్వామి ప్రభాస్ గురించి మాట్లాడుతూ ప్రభాస్ కెరియర్ ఇంక అయిపోయినట్టే అని ఇకపై ప్రభాస్ సినిమాలన్నీ ఫ్లాప్ అవుతాయి తప్ప ఒక్క సినిమా కూడా హిట్ అయ్యే అవకాశాలు లేవని తేల్చి చెప్పిన సంగతి తెలిసిందే. ఇప్పుడు శ్యామలాదేవి వేణు స్వామికి గట్టిగా కౌంటర్ ఇచ్చారు.

మంచితనం ఒక మనిషిని ఎంత దూరం తీసుకెళ్తుందో మరొకసారి రుజువైంది అంటూ కల్కి సినిమా భారీ విజయం గురించి చెప్పుకొచ్చారు శ్యామలాదేవి. బాహుబలి తర్వాత ప్రభాస్ అసలు సక్సెస్ అందుకోలేరు అని కొంతమంది చెప్పారు కానీ వాళ్లు అనుకున్న దానికి రివర్స్ లో జరిగింది. పెళ్లి విషయంలో కూడా అలాగే జరుగుతుంది అంటూ చెప్పుకొచ్చారు శ్యామలాదేవి.

ఇక ప్రభాస్ ఇప్పట్లో పెళ్లి చేసుకోరని జీవితం మొత్తం సింగిల్ గానే ఉండిపోతారని కొందరు జ్యోతిష్యం చెప్పారు. ఈ విషయం గురించి మాట్లాడుతూ శ్యామలాదేవి అవి కూడా రివర్స్ అవుతాయి అంటూ ఇన్ డైరెక్ట్ గా ప్రభాస్ పెళ్లి చేసుకుంటారు అంటూ క్లారిటీ ఇచ్చారు.

ప్రస్తుతం శ్యామలాదేవి చెప్పిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ప్రభాస్ పెళ్లి కోసం అభిమానులు చాలా ఏళ్లుగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఎంతోమంది హీరోయిన్లతో లింకప్ రూమర్లు వచ్చాయి కానీ అందులో ఒకటి కూడా నిజమవలేదు. నటి పాయల్ రాజ్ పుత్ తో ప్రభాస్ వివాహం జరగబోతోంది అని కూడా సోషల్ మీడియా కూడా కూసింది కానీ అది కూడా నిజమవలేదు.

మరి ప్రభాస్ ఎప్పటికి పెళ్ళికొడుకు అవుతారు వేచి చూడాలి. సినిమాల పరంగా చూస్తే కల్కి తో సూపర్ సక్సెస్ అందుకున్న ప్రభాస్ త్వరలోనే సలార్ 2 లో కనిపించబోతున్నారు. సందీప్ వంగా దర్శకత్వంలో స్పిరిట్ అనే సినిమాతో కూడా బిజీగా ఉన్న ప్రభాస్ మారుతీ దర్శకత్వంలో కూడా ఒక సినిమా చేస్తున్నారు. ఇక కల్కి సినిమాకి రెండవ భాగం కూడా ఉండబోతున్న సంగతి తెలిసిందే. చేతినిండా సినిమాలతో ప్రభాస్ ఇప్పుడు టాలీవుడ్ లోనే బోలెడు సినిమా ఆఫర్లు ఉన్న స్టార్ హీరోగా మారిపోయారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu