HomeTelugu Big StoriesKrishnam Raju Birth Anniversary: మొగల్తూరులో కృష్ణంరాజు జయంతి వేడుకలకు భారీ ఏర్పాట్లు

Krishnam Raju Birth Anniversary: మొగల్తూరులో కృష్ణంరాజు జయంతి వేడుకలకు భారీ ఏర్పాట్లు

krishnam raju birth anniver

Krishnam Raju Birth Anniversary: ప్రముఖ నటుడు రెబల్ స్టార్, కేంద్ర మాజీ మాంత్రి, స్వర్గీయ కృష్ణంరాజు జయంతి వేడుకలు ఈ నెల 20వ తేదీన మొగల్తూరులో నిర్వహించనున్నారు. కృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవి, కూతురు ప్రసీద, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఈ వేడుకలకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా స్థానిక శ్రీ అందే బాపన్న కళాశాలలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించబోతున్నారు.

ఈ వైద్య శిబిరం కృష్ణంరాజు, డాక్టర్ వేణు కవర్తపు ట్రస్టీలుగా ఉన్న యూకే ఇండియా డయాబెటిక్ ఫుట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరగనుంది. ఈ ఉచిత వైద్య శిబిరంలో జుబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రి నుంచి డాక్టర్ శేషబత్తారు, భీమవరంలోని వర్మ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ నుంచి డా.వర్మ పాల్గొంటారు. కృష్ణంరాజు జయంతి వేడుకల్లో సందర్భంగా ఏర్పాటు చేయనున్న ఈ ఉచిత వైద్య శిబిరంలో డయాబెటిస్‌తో బాధపడుతున్న స్థానిక ప్రజలకు ఉచిత వైద్య పరీక్షలు, మెడిసిన్స్, చికిత్స అందిస్తారని కృష్ణంరాజు భార్య శ్యామలాదేవి తెలిపారు.krishnam raju

మొగల్తూరుతో పాటు చుట్టు పక్కల గ్రామాల ప్రజలు కూడా ఈ ఉచిత వైద్య శిబిరం సేవలను ఉపయోగించుకోవచ్చని ఆమె వెల్లడించారు. “కృష్ణం రాజు గారి జయంతి వేడుకలను ఆయనకు ఎంతో ఇష్టమైన మొగల్తూరులో చేస్తున్నాం. ఈ సందర్భంగా శ్రీ అందే బాపన్న కళాశాలలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేస్తున్నాం. ఈ శిబిరానికి విదేశాల నుంచి పలువురు వైద్యులు వస్తున్నారు.

ఇక్కడి ప్రజలంతా ఈ వైద్య శిబిరం సేవలు వినియోగించుకోవాలి. పేదలకు వైద్య సేవలు అందాలని ఆయన ఎప్పుడూ కోరుకునేవారు. నేను, ప్రసీద, ప్రభాస్ ఈ వైద్య శిబిరం ఏర్పాటు చేయిస్తున్నాం. సుమారు వెయ్యి మంది దాకా ఈ వైద్య శిబిరానికి వస్తారని ఆశిస్తున్నాం” అని శ్యామలాదేవి తెలిపారు.

రెబల్ స్టార్ కృష్ణంరాజు 2022 సంవత్సరంలో నవంబర్ 9న అనారోగ్యంతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. కృష్ణంరాజు మొగుల్తూరులో 1904, జనవరి 20న జన్మించిన ఆయన చదువు పూర్తి చేశాకా కొన్నాళ్లు జర్నలిస్టుగా పని చేశారు. ఆ తర్వాత సినీ రంగంపై ఆసక్తితో ఎంట్రీ ఇచ్చారు. 1966లో చిలకా గోరింక మూవీతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చాడు.

 

 

Recent Articles English

Gallery

Recent Articles Telugu