రిష్వి తిమ్మరాజు, విస్మయశ్రీ జంటగా ‘కృష్ణగాడు అంటే ఒక రేంజ్’ సినిమా రూపొందిస్తున్నారు. లవ్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ తాజాగా నిర్వహించారు. ఈవెంట్‌కు ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్, టీఎఫ్‌సీసీ సెక్రటరీ కే ఎల్ దామోదర్ ప్రసాద్, బెక్కం వేణుగోపాల్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
శ్రీ తేజస్ ప్రొడక్షన్ బ్యానర్‌పై కృష్ణమూర్తి, వెంకట సుబ్బమ్మ, శ్రీలత సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. రాజేష్ దొండపాటి తెరకెక్కించిన ఈ చిత్రం, సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని యు/ఎ సర్టిఫికేట్‌ను పొందింది. ఈ మూవీని ఆగస్ట్ 4న గ్రాండ్ లెవల్లో రిలీజ్ చేస్తున్నారు.
‘కృష్ణ గాడు అంటే ఒక రేంజ్’ చిత్ర బృందానికి ఎమ్మెల్యే ఆల్ ది బెస్ట్. చక్కటి కుటుంబ కథా చిత్రాన్ని విజయవంతంగా పూర్తి చేసిన ప్రతి ఒక్కరికీ, శుభాకాంక్షలు. మా వరంగల్ వాళ్లకి అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు అన్నారు.
నిర్మాత రఘురామ్ మాట్లాడుతూ కృష్ణ అనే యువకుడి కథే ఇది. తండ్రి కలను నెరవేర్చటానికి కొడుకు పడ్డ కష్టం. తన ప్రేమ, భావోద్వేగాలను అందంగా చూపించే ప్రయత్నమే మా ‘కృష్ణగాడు అంటే ఒక రేంజ్’ తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా ఈ సినిమాను రాజేష్ గారు మలిచారు. చిన్న చిన్న ఆనందాలు కూడా కోల్పోతూ ఉంటే వచ్చే సంఘర్షణలను ఈ సినిమాలో చూపించాం. ప్రేక్షకులు మా సినిమాను ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను అన్నారు.
డైరెక్టర్ రాజేష్ దొండపాటి మాట్లాడుతూ.. నా ఫ్రెండ్ రాము వల్లే ఈ సినిమా స్టార్ట్ అయింది. నా కుటుంబ సభ్యులు, స్నేహితుల సపోర్ట్ వల్లే ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నాను. మా నిర్మాతకు ఎంతో గట్స్ ఉన్నాయి. మమ్మల్ని నమ్మి మాకు చాన్స్ ఇచ్చిన నిర్మాత రఘు గారికి, మా టీమ్ సభ్యులకు కృతజ్ఞతలు అన్నారు.