నందమూరి బాలకృష్ణ నటిస్తోన్న ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ చిత్రంపై ప్రస్తుతం ఓ వార్త హల్ చల్ చేస్తోంది. ఈ సినిమాలో పాటలను భాజీరావు మస్తానీ అనే బాలీవుడ్ సినిమా నుండి తీసుకున్నారని.. విజువల్ ఎఫెక్ట్స్ ను సైతం వాడేశారని.. సౌండ్ ట్రాక్ కూడా కాపీ చేశారని టాక్స్ వినిపించాయి.
క్రిష్ కు బాలీవుడ్ లో ఉన్న ఇన్ఫ్లూయన్స్ కారణంగానే ఇది సాధ్యమైందని అంతా అనుకున్నారు.
కానీ ఈ మాటల్లో నిజం లేదని క్రిష్ వివరణ ఇవ్వాల్సి వచ్చింది. బాజీరావు మస్తానీ సినిమాకు ఇది కాపీ అనే విషయాన్ని క్రిష్ ఖండించాడు. ఇది అచ్చమైన తెలుగు సినిమా అని ఇతర సినిమా నుండి కాపీ కొట్టాల్సిన అవసరం లేదని అన్నారు. అసలు అలాంటి ఆలోచనే మాలు రాలేదని అన్నారు.
సినిమా గ్రాఫిక్స్ కోసం రాత్రి, పగలూ కష్టపడుతున్నామని.. మరో రెండు వారాల వర్క్ ఉందని ఈలోగా ఇటువంటి పుకార్లు రావడం బాధకారమని స్పష్టం చేశారు. ఈ సినిమా ఆడియో ఈ నెల 26న విడుదలకు సిద్ధంగా ఉంది. ఆరోజుతో అసలు నిజం ఏంటో తెలిసిపోతుంది!