ఈ రోజు రాజకీయ నాయకుడి గ్రాఫ్ ? మరియు నేపథ్యం విషయానికి వస్తే… కొట్టు సత్యనారాయణ. ప్రస్తుతం ప్రజల్లో కొట్టు సత్యనారాయణ పరిస్థితేంటి ?, అసలు ఆయన నేపథ్యం ఏమిటి ? తెలుసుకుందాం రండి. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లి గూడెం లో కొట్టు సత్యనారాయణ జన్మించారు. పెంటపా డు లోని డి.ఆర్.జి ప్రభుత్వ కళాశాలలో ఇంటర్మీడియట్ పూర్తి చేశారు. రాజకీయాల్లో రాకముందు కొట్టు సత్యనారాయణ వ్యాపార రంగంలో ఉన్నారు. అనంతరం కొట్టు సత్యనారాయణ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయ ప్రవేశం చేసి 1994, 1999 లలో కాంగ్రెస్ పార్టీ తరపున తాడేపల్లిగూడెం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు.
2004లో వైఎస్ రాజశేఖరరెడ్డి ఆదరణ ఉండటంతో తాడేపల్లి గూడెం నుంచి మూడో సారి పోటీ చేశారు. అయినా ఓటమి ఎమ్మెల్యేగానే ఎన్నికయ్యారు. ఆ తర్వాత కూడా 2009లో ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థి ఈలి నాని చేతిలో ఓటమి పాలయ్యారు. ఇలా వరుసగా ఓడిపోతూనే వచ్చినప్పటికీ.. కొట్టు సత్యనారాయణ మాత్రం ఎన్నడూ వెనుకడుగు వేయలేదు. 2014లో కాంగ్రెస్ పార్టీ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగారు. అప్పుడు కూడా సత్యనారాయణ మరోసారి ఓటమి పాలయ్యారు.
ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరి పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. 2019 ఎన్నికలకు ముందు ఆ పార్టీని వీడి వైసీపీలో చేరారు. 2019లో రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2022లో జరిగిన మంత్రివర్గ విస్తరణలో దేవాదాయ ధర్మాదాయ శాఖల మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఇంతకీ రాజకీయ నాయకుడిగా కొట్టు సత్యనారాయణ గ్రాఫ్ ఎలా ఉంది ?, ప్రజల్లో కొట్టు సత్యనారాయణ పై ఉన్న ప్రస్తుత అభిప్రాయం ఏమిటి ?, వచ్చే ఎన్నికల్లో కొట్టు సత్యనారాయణ పరిస్థితి ఎలా ఉండబోతుంది ?,
ఇప్పుడున్న సమాచారం ప్రకారం.. కొట్టు సత్యనారాయణ మళ్ళీ గెలిచి అవకాశం ఉంది. ప్రజల్లో కొట్టు సత్యనారాయణ పై అభిమానం ఉంది. దీనికితోడు ఆర్థిక , అంగ బలం కలిగి ఉన్న సత్యనారాయణ జిల్లా మెట్ట రాజకీయాల్లో కీలకమైన కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు. కాబట్టి, పార్టీలతో పాటు జగన్ రెడ్డి పై ఉన్న వ్యతిరేఖత తో కూడా సంబంధం లేకుండా కొట్టు సత్యనారాయణ కచ్చితంగా గెలుస్తాడు.