బుల్లితెర స్టార్ యాంకర్ అనసూయ భరద్వాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనసరం లేదు. ఆమె అందంతో, డ్రెసింగ్ స్టైల్‌తో యూత్‌లో మంచి పాలోయింగ్ తెచ్చకుంది. అయితే ఆమెను విమర్మించే వాళ్లు లేకపోలేదు. తాజాగా అనసూయ డ్రెస్సింగ్ స్టైల్‌పై సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అనసూయ మంచి డ్యాన్సరే కాక మంచి నటి అని, అయితే ఆమె వేసుకునే బట్టలు మాత్రం తనకు నచ్చవని ఆయన కామెంట్ చేశారు.
ఇటీవలె ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. అనసూయ లాంటి అందమైన అమ్మాయి ఎలా ఉన్నా జనాలు చూస్తారు. అలాంటి బట్టలు వేసుకోవాల్సిన పనిలేదు. ఆమె చక్కటి నటి. కానీ ఆమె డ్రెస్సింగ్ నాకు నచ్చదు. ఆమె మీద గౌరవం ఉంది కాబట్టే డ్రెస్సింగ్ మారిస్తే బావుంటుందని అంటున్నాను అని పేర్కొన్నారు. ప్రస్తుతం కోట చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.