సోషల్ మీడియా పుణ్యమా అని సెలబ్రిటీలకు సంబంధించిన వార్తలు వెంటనే అందరికీ తెలిసిపోతున్నాయి. ఫ్యాన్స్ కూడా వల్ల ఫేవరేట్ హీరో అప్డేట్స్ తెలియడంతో సంతోషం వ్యక్తం చేసున్నారు. ఇంత వరకు బాగానే ఉంది. అయితే ఫేక్ న్యూస్‌లు కూడా ఎక్కువైపోయ్యాయి. బ్రతికి ఉన్నవారిని కూడా చంపేస్తున్నారు. ఈ క్రమంలో వారే.. బయటకు వచ్చి మేము బ్రతికే ఉన్నాం.. అని చెప్పుకోవాల్సిన దుస్థితి ఏర్పడంది.
తాజాగా అలాంటి ఓ ఫేక్ న్యూస్ నెట్టింట వైరల్ అవుతుంది. టాలీవుడ్ సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు మరణించారంటూ ఓ వార్త చక్కర్లు కొడుతుంది. ఇప్పటికే టాలీవుడ్‌లో పలు విషాదాలు నెలకొన్న ఈ సమయంలో కొందరు నిజా నిజాలు తెలుసుకోకుండా కోట శ్రీనివాసరావు చనిపోయారంటూ వార్తలను సోషల్ మీడియాలో రాసేస్తున్నారు.
ఈ వార్తలపై కోట శ్రీనివాసరావు స్పందించారు. తాను మృతిచెందినట్లు సోషల్ మీడియాలో కొందరు ప్రచారం చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఆరోగ్యంగానే ఉన్నానని.. ఆ వదంతులను నమ్మొద్దని కోరారు. ఈ మేరకు ఆయన ఓ వీడియోను విడుదల చేశారు. మనిషి ప్రాణాలతో ఆడుకోవద్దని.. తప్పుడు ప్రచారం చేస్తున్నవారికి ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పాలని కోట శ్రీనివాసరావు కోరారు. డబ్బు కోసం ఇలాంటి వార్తలు రాయటం చాలా దుర్మార్గమని ఆయన పేర్కొన్నారు.
ఓ వార్త రాసేముందు అది నిజమో కాదో చూసుకుంటే బాగుంటుంది. లేదంటే బతికున్న వాళ్లను కూడా చంపేసి.. వారికి వారి కుటుంబ సభ్యులకు అభిమానులకు మానసిక క్షోభను అందించినవారవుతారు. ఇప్పటికైనా ఇలాంటి అసత్యపు వార్తలు ప్రచారం చేయొద్దు అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
ఆసక్తికరంగా ‘రంగమార్తాండ’ ట్రైలర్
దసరా ట్రైలర్: కత్తుల సాముతో ట్రైలర్ అంతా రక్తంతో పులుముకుంది
బట్టలు లేకుండా హట్ లుక్‌లో విద్యాబాలన్
రావణాసుర టీజర్: రవితేజ హీరో నా.. విలన్‌నా!
హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు
శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు