సినిమా ఇండస్ట్రీ రచయితల పట్ల ఎంతో అన్యాయంగా వ్యవహరిస్తోందని చాలా మంది రచయితలు తమ ఆవేదనను వ్యక్తం చేస్తూ ఉంటారు. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో సీనియర్ నటుడు, రచయిత తనికెళ్ళ భరణి సైతం ఈ విషయంపై ఆవేదన వ్యక్తం చేశారు.
సీనియర్ల వ్యవహారమే ఆ విధంగా ఉంటే కొత్తగా వచ్చే వారి పరిస్థితి ఏంటి..?. మొన్నమధ్య కొరటాల శివ కూడా ఈ విషయంపై రియాక్ట్ అయ్యారు. పారితోషికం పరంగా.. గుర్తింపు పరంగా రైటర్స్ పరిస్థితి ఘోరంగా ఉంటోందని ఆయన చెప్పారు. ‘సింహా’ సినిమా సమయంలో ఆయనకు జరిగిన అన్యాయం గురించి కూడా ఆయన ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.
రచయితగా ఆయనకు సంతృప్తి లేకపోవడం వలనే దర్శకుడిగా మారానని అన్నారు. అలాంటి కొరటాల శివకు రచయితల కష్టం తెలుసుననే ఓ సంఘటన చోటుచేసుకుంది. కొరటాల, మహేష్ సినిమా కోసం వేరే రచయిత దగ్గర నుండి కథ తీసుకొని దానికి అతని స్టైల్ లో యాడ్ చేసి డెవలప్ చేశారు.
దీనికి గాను ఆ రైటర్ కు కోటి రూపాయల పారితోషికం ఇవ్వడమే కాకుండా.. క్రెడిట్ కూడా ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. కొరటాలకు ఉన్న గొప్ప మనసుకి ఇదే నిదర్శనమని చెబుతున్నారు.