పవన్ కల్యాణ్, కొరటాల శివ కాంబినేషన్ వింటుంటేనే హిట్ సినిమా అనే అభిప్రాయాలు కలుగుతున్నాయి. రచయిత నుండి దర్శకుడిగా మారిన కొరటాల శివ వరుస హిట్ చిత్రాలతో ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా మారిపోయాడు. ప్రస్తుతం ఆయన మహేష్ బాబు హీరోగా ఓ సినిమా చేస్తున్నాడు.
డిసంబర్ నెలలో లేదా జనవరిలో ఈ సినిమాను పట్టాలెక్కించడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా తరువాత కొరటాల శివ తన తదుపరి చిత్రం రామ్ చరణ్ తో చేయనున్నాడనే వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. అయితే కొరటాల మాత్రం దీనికి భిన్నంగా తన సినిమా పవన్ కల్యాణ్ తో చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం.
పవన్ కోసం ఒక కథను సిద్ధం చేసుకొని ఆయనకు వినిపించే ప్రయత్నం చేస్తున్నారు కొరటాల. పవన్ ప్రస్తుతం మూడు
వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. మధ్యలో సమయం దొరికినప్పుడు పవన్ కలిసి కథ ఓకే చేయించుకోవాలనేది కొరటాల ప్లాన్. పవన్ కు కూడా ఇప్పటికే దీనికి సంబంధించి సంకేతాలు పంపినట్లు టాక్. మరి కొరటాల కథకు ఓకే చెప్తాడో.. లేదో.. చూడాలి!