HomeTelugu Big StoriesKoratala Siva: డిజాస్టర్ తర్వాత రెమ్యూనరేషన్ పెంచేసిన డైరెక్టర్

Koratala Siva: డిజాస్టర్ తర్వాత రెమ్యూనరేషన్ పెంచేసిన డైరెక్టర్

Koratala Siva demands hefty paycheck after Acharya
Koratala Siva demands hefty paycheck after Acharya

Koratala Siva Remuneration for Devara:

దర్శకుడు కొరటాల శివ ఈమధ్యనే దర్శకత్వం వహించిన ఆచార్య సినిమా పెద్ద డిజాస్టర్ అయిన సంగతి తెలిసిందే. అంతకుముందు ఎన్ని హిట్ సినిమాలు తీసినా కూడా.. ఈ ఒక్క సినిమా ఆయన కెరీర్‌ పై తీవ్ర ప్రభావం చూపించింది. ఈ సినిమా వివాదాలకు కారణమై ఆయన పరువును కూడా బాగానే దెబ్బతీసింది అని చెప్పచ్చు.

అయినప్పటికీ, ఆయన నెక్స్ట్ సినిమా దేవర కోసం భారీ రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమా సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ప్రస్తుతం ఈ చిత్రం ప్రమోషన్లలో చిత్ర బృందం బిజీగా ఉంది.

తాజా సమాచారం ప్రకారం, కొరటాల శివ దేవర కోసం ఏకంగా 30 కోట్ల రూపాయలు తీసుకున్నారని తెలుస్తోంది. చిరంజీవి నటించిన ఆచార్య సినిమా ఆయన కెరీర్‌లోనే డిజాస్టర్ అయిన చిత్రంగా నిలిచినప్పటికీ, కొరటాల శివ ఈ రెమ్యునరేషన్ తీసుకోవడానికి కారణం ఆయనకు ఉన్న కాన్ఫిడెన్స్ అని టాక్ నడుస్తోంది. పైగాజనతా గ్యారేజ్ వంటి సూపర్ హిట్ తర్వాత ఎన్టీఆర్ -:కొరటాల శివ కాంబోలో తెరకెక్కుతున్న రెండో సినిమా.

Read More: Bigg Boss 8 Telugu కోసం నాగార్జున లో మార్పు.. కానీ ఆ ఒక్కటీ మారలేదు

అంతేకాకుండా ఈ సినిమాకి స్క్రిప్ట్ వర్క్, ఇతర ప్రీ ప్రొడక్షన్ పనులు దాదాపు రెండేళ్లపాటు కొనసాగాయి. అందువల్ల, దర్శకుడు కూడా భారీ పారితోషకం డిమాండ్ చేసినట్టు టాక్. కానీ నిర్మాతలు మాత్రం చేసేది లేక ఒప్పుకున్నారట. కొరటాల శివ మిర్చి, శ్రీమంతుడు, భరత్ అనే నేను వంటి బ్లాక్‌బస్టర్ సినిమాలు ఇచ్చారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu