టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం ‘ఆచార్య’. కొరటాల శివ దర్శకత్వంలో తెరక్కెకుతున్న ఈ సినిమా నుంచి మోషన్ పోస్టర్ ఇటీవల విడుదలైంది. అయితే ఈ సినిమా కథ తనదే అని రాజేష్ అనే వ్యక్తి మీడియా ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై స్పందించాడు డైరెక్టర్ కొరటాల. ఇది ఎవరి స్టోరీ కాదని.. తాను సొంతంగా రాసుకున్న కథ అని తెలిపాడు. ఇదే విషయం పై ఓ ఛానల్‌లో జరిగిన డిబేట్‌లో కొరటాల శివకు రాజేష్ అనే వ్యక్తికి మధ్య వాగ్వాదం జరిగింది. దేవాలయాల భూములపై నేను రాసుకున్న కథను కొరటాల తీస్తున్నారని రాజేష్ ఆరోపిస్తున్నాడు. ‘అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికి మొదటిగా నా కథను వినిపించా.. నేను చూసిన నిజ జీవిత కథల ఆధారంగా స్టోరీ రాసుకున్నా.. ఆ కథను మైత్రి మూవీస్ కు వినిపించాను. నాపై అంత బడ్జెట్ పెట్టలేక ఆ కథను కొరటాల కు ఇచ్చి చేయిస్తున్నారు” అంటూ రాజేష్ ఆరోపిస్తున్నాడు. ఒక వేళ ఇది నా కథకాకపోతే నేను క్షమాపణ చెప్తాను అన్నాడు రాజేష్.
దినిపై కొరటాల వివరణ ఇస్తూ ‘మీరు రాసుకున్న కథ వేరు.. నా కథ వేరు. సామాజిక అంశాలపై ఎవరికీ తోచిన విధంగా వారు కథలు రాసుకుంటూ ఉంటారు’. ‘ఇది రాజేష్ రాసుకున్న కథ కాదు .ఇది నేను రాసుకున్న కథ. షూటింగ్ దశలో ఉన్న సినిమా స్టోరీ నేను ఎలా చెప్పగలను. ఆరోపణలు చేస్తున్న ప్రతి ఒక్కరికి నేను కథలు వినిపించుకుంటూ పోవాలా ..? అని శివ అన్నాడు. ‘నేను కో డైరెక్టర్ ద్వారా కథ తెలుసుకొని నేను మాట్లాడుతున్నా… ఇది ఖశ్చితంగా నా కథే అని అన్నాడు రాజేష్. దాంతో కొరటాల శివ మండిపడ్డారు. ‘నా కోసం పనిచేసే నా మనుషులు కథను ఎలా బయటకు చెప్తారు. ఇది మొత్తం అసత్యారోపణలు అని అన్నారు. ఆచార్య సినిమా కథ అతను చెప్పే కథ ఒకటి కాదు అని ఎన్నిసార్లు చెప్పినా అతను వినడంలేదు. దాంతో కొరటాల ఈ విషయం పై కోర్టుకు వెళ్తా అని అన్నారు. తన సినిమాపై అనవసరంగా ఆరోపణలు చేస్తున్నారని కొరటాల అన్నారు. అంతే కాకుండా చిరంజీవి దృష్టికి కూడా ఇది తీసుకువెళ్తానని అన్నారు.