‘కోమాలి’ చిత్ర యూనిట్ సూపర్ స్టార్ రజనీకాంత్, ఆయన ఫ్యాన్స్‌కు క్షమాపణలు చెప్పింది. ఇంతకీ క్షమాపణలు చేప్పే పరిస్థితి ఎందుకొచ్చిందంటే… కాజల్ అగర్వాల్, జయం రవి జోడీగా తెరకెక్కుతున్న ‘కోమాలి’ మూవీ ట్రైలర్‌ను తాజాగా విడుదల చేశారు. ట్రైలర్‌కు మంచి స్పందనతో పాటు వివాదానికి కూడా తెరలేపింది… అసలు విషయానికి వస్తే.. ఈ మూవీ స్టోరీ ప్రకారం హీరో జయం రవి కోమాలోకి వెళ్లిపోతాడు.. చాలా సంవత్సరాల తర్వాత సాధారణ స్థితికి వస్తాడు. అయితే, ఆయనకు కోమాలోకి వెళ్లకముందు.. కోమాలో నుంచి బయటకు వచ్చిన తర్వాత జరిగిన స్టోరీకి కాస్త కామెడీని జోడించారు. అదే వివాదానికి కారణమైంది.
జయం రవి కోమాలో నుంచి బయటకు వచ్చిన తర్వాత ‘నేను రాజకీయాల్లోకి రావడం ఖాయం’ అని రజనీకాంత్ ఇటీవల చెప్పిన వీడియోను చూస్తాడు.. ‘ఇది లేటస్ట్‌ది కాదు; 1996ది. ఎవర్ని మోసగిస్తున్నారు?’ అని ప్రశ్నిస్తాడు. దీనిపై రజినీకాంత్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియా కూడా డైరెక్టర్‌ను వెంటాడింది.. అయితే దీనిపై క్లారిటీ ఇచ్చాడు దర్శకుడు… తాను కూడా రజిని అభిమానినే. ఆయన చిత్రాలకు కటౌట్లు కట్టి, పాలాభిషేకాలు కూడా చేశా. ఇది ఆయనపై ఉన్న గౌరవంతో, రాజకీయాల్లోకి రావాలన్న ఉద్దేశంతోనే తీసిన సీన్ తప్పదీని వెనుక వేరే ఉద్దేశం లేదని క్లారిటీ ఇచ్చారు. అంతే కాదు.. ఆ సీన్‌ను తొలగించనున్నట్టు నిర్మాత ఐసరి గణేష్ ప్రకటించడం.. జయం రవి, నిర్మాత రజనీకి, ఫ్యాన్స్‌కి చెప్పడం జరిగిపోయాయి.