Kollywood upcoming big releases:
అక్టోబర్ 10వ తేదీన Kollywood లో రెండు భారీ బడ్జెట్ సినిమాలు విడుదల కి సిద్ధం అవుతున్నాయి. అందులో ఒకటి సూర్య హీరోగా నటించిన కంగువ. మరొకటి సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నటించిన వెట్టయన్. ఈ రెండు సినిమాల మీద తమిళ్ ప్రేక్షకుల్లో మాత్రమే కాక ప్రపంచవ్యాప్తంగా అభిమానులకి భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి.
భారీ బడ్జెట్ తో ప్యాన్ ఇండియా రేంజ్ లో విడుదల కాబోతున్న ఈ రెండు సినిమాలకి బాక్స్ ఆఫీస్ వద్ద కనీసం 500 కోట్ల దాకా వసూళ్లను చేయగలిగే కెపాసిటీ ఉంది. కానీ ఇప్పుడు రెండు సినిమాలు ఒకటే రోజు విడుదల కావడం ఏదో ఒక సినిమాకి మైనస్ పాయింట్ అయ్యేలాగా కనిపిస్తోంది.
రెండు సినిమాల నిర్మాతలకు మధ్య ఏం జరిగిందో తెలియదు కానీ Kollywood కి ఇది పెద్ద లాస్ అయ్యేలాగా కనిపిస్తుంది. ఒకవైపు ఇద్దరు స్టార్ హీరోలే కాబట్టి రెండు సినిమాలు ఒకేరోజు విడుదల అయితే సోషల్ మీడియాలో అభిమానుల మధ్య కూడా వారు జరిగే అవకాశం ఉంటుంది. అనవసరంగా ఫ్యాన్ వార్స్ కారణంగా ఒక సినిమా ఎఫెక్ట్ అవుతుంది.
కోలీవుడ్ నుంచి ఇప్పుడిప్పుడే ప్రపంచవ్యాప్తంగా అభిమానులకి నచ్చే విధంగా మహారాజా వంటి సినిమాలు వస్తున్నాయి. మరి ఈ సమయంలో రెండు పెద్ద సినిమాలను ఒకేసారి విడుదల చేయడం తమిళ్ సినిమా ఇండస్ట్రీకి కూడా పెద్ద అవకాశం పోయినట్టు అవుతుంది. ఈ నేపథ్యంలో ఏదో ఒక సినిమా వెనక్కి తగ్గితే బావుంటుంది అని సినీ పెద్దలు కూడా చెప్తున్నారు.
శివ దర్శకత్వం వహించిన కంగువ ఫాంటసీ యాక్షన్ సినిమాగా ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. ఇక రజినీకాంత్ వెట్టయన్ ఒక యాక్షన్ డ్రామానే ఆయనప్పటికీ భారీ తారాగణంతో భారీ అంచనాల మధ్య విడుదల కానుంది.