
HIT 3 Climax Twist:
నాని సమర్పణలో రూపొందుతున్న ‘HIT: The Third Case’ థ్రిల్లర్ ప్రియులకు treat ఇవ్వబోతోంది. సినిమా విడుదలకు నెలరోజులే ఉండగా, ఇప్పటికీ ప్రమోషన్స్ ఊపందుకోవడం లేదు. అయితే, HIT ఫ్రాంచైజ్ మీద హైప్ మాత్రం తగ్గలేదు. సినిమా ఫైనల్ స్టేజీలో ఉండగానే HIT 4 గురించి చర్చలు మొదలయ్యాయి!
HIT: The Third Case క్లైమాక్స్‌లో ఓ పెద్ద ట్విస్ట్ ఉంటుందని టాక్. ఇది HIT 4 లో కొత్త పోలీస్ ఆఫీసర్ ఎంట్రీకి పూనుకోనుంది. ఇప్పుడీ పాత్రకు ఇద్దరు స్టార్స్ పేర్లు వినిపిస్తున్నాయి – కార్తీ (Kollywood) & దుల్కర్ సల్మాన్ (Mollywood).
ముఖ్యంగా, కార్తీ హిట్ 3 క్లైమాక్స్‌లో ఓ స్పెషల్ కామియో చేస్తాడనే టాక్ ఉంది. ఇదే నిజమైతే, Nani HIT 2 లో చేసినట్లు కార్తీ HIT 4 కు లీడ్‌గా మారుతాడు. మరోవైపు, దుల్కర్ సల్మాన్ ఇప్పటికే HIT 4 కు సైన్ చేశాడని కొన్ని రూమర్స్ ఉన్నాయి.
కార్తీ – ‘కైథి’, ‘సర్దార్’ లాంటి యాక్షన్ థ్రిల్లర్స్‌తో మాస్ హవీగా దూసుకుపోతున్నాడు. దుల్కర్ సల్మాన్ – ‘Kurup’, ‘Salute’ లాంటి డిఫరెంట్ పాత్రలతో ఆకట్టుకున్నాడు.
ఈ ఇద్దరూ HIT 4 కి సరిపోతారనే టాక్ ఉన్నప్పటికీ, క్లైమాక్స్ ట్విస్ట్ తర్వాతే అసలు విషయం తెలుస్తుంది. నాని HIT ఫ్రాంచైజ్‌ని పాన్-ఇండియా లెవెల్‌కి తీసుకెళ్తున్నాడు, ఇంకా ఎవరు లీడ్ చేస్తారో చూడాలి!
ALSO READ: హను రాఘవపూడి కి బంపర్ ఇచ్చిన Prabhas