కరోనా వైరస్ కారణంగా దేశంలో లాక్‌డౌన్ కొనసాగుతుంది. ఈ నేపద్యంలో సినిమా తీయాలని కోలీవుడ్ నిర్మాత ఎం. విజయ భాస్కర్ రాజ్ నిర్ణయించారు. ‘21 డేస్’ పేరుతో స్వీయ దర్శకత్వంలో ఈ సినిమాని రూపొందిస్తున్నట్టు ప్రకటించారు. డైరెక్టర్‌గా ఆయనకిదే తొలి చిత్రం. కథ, కథనం, మాటలు కూడా ఆయనే అందిస్తున్నారు.
వైరస్‌పై ప్రజల్లో చైతన్యం కలిగించేలా చిత్రాన్ని రూపొందిస్తామని విజయ్ చెప్పారు. వైరస్ ప్రమాదాన్ని తెలిపే సూక్ష్మ సినిమా కాదని, స్నేహం, ప్రేమ తదితర అంశాలు కూడా ఉంటాయని తెలిపారు. మూడు గంటల్లోనే కథ తట్టిందని, వారం రోజుల్లో స్క్రిప్ట్ తయారు చేశానని విజయ్ భాస్కర్ తెలిపారు. లాక్‌డౌన్ ముగిసిన వెంటనే షూటింగ్ మొదలు పెట్టాలన్న ఆలోచనతో ఉన్నానని చెప్పారు. అంతా సవ్యంగా సాగితే తమిళ్‌తో పాటు తెలుగు, హిందీ భాషల్లో కూడా సినిమాను విడుదల చేస్తామని తెలిపారు.