Kollywood Directors with Tollywood Heores:
టాలీవుడ్ వరల్డ్‌వైడ్ క్రేజ్ సంపాదించడంతో ఇతర భాషల దర్శకులు తెలుగులో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. అయితే కొలీవుడ్ డైరెక్టర్లు టాప్ హీరోలతో సినిమాలు చేయగా అవి పెద్దగా హిట్ కాలేకపోయాయి. తాజాగా శంకర్, రామ్ చరణ్ కాంబినేషన్‌లో వచ్చిన “గేమ్ ఛేంజర్” కూడా అంచనాలను అందుకోలేకపోయింది.
శంకర్ టాలీవుడ్‌కి రాకముందే డబ్బింగ్ సినిమాలతో సెన్సేషన్ క్రియేట్ చేశారు. కానీ “గేమ్ ఛేంజర్” పెద్ద నిరాశ కలిగించింది.
వెంకట్ ప్రభు తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు నాగ చైతన్యతో “కస్టడీ” సినిమా తీశారు. కానీ ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ అయ్యింది. అంతకు ముందు చైతన్య “యుద్ధం శరణం” అనే సినిమా కృష్ణ మారిముత్తు అనే తమిళ దర్శకుడితో చేశారు. అది కూడా పెద్దగా ఆడలేదు.
రామ్ పోతినేని నటించిన “ది వారియర్” ను లింగుస్వామి డైరెక్ట్ చేశారు. కానీ ఈ సినిమా కూడా డిజాస్టర్ అయ్యింది. సముద్రఖని పవన్ కల్యాణ్, సాయి ధరమ్ తేజ్‌లతో “BRO” మూవీ తీసి హిట్ కొట్టాలనుకున్నారు. కానీ ఆ సినిమా కూడా అంతగా ఆకట్టుకోలేకపోయింది.
విజయ్ దేవరకొండ తన మొదటి కోలీవుడ్ ప్రాజెక్ట్ “NOTA” లో ఆనంద్ శంకర్ తో కలిసి పని చేసి ఫ్లాప్ అందుకున్నారు. ప్రభాస్ తో రాఘవ లారెన్స్ తీసిన “రెబల్” కూడా డిజాస్టర్ అయ్యింది.
మహేష్ బాబు చేసిన “నాని”, “స్పైడర్” రెండూ కోలీవుడ్ దర్శకుల చేతిలోనే డిజాస్టర్లుగా మారాయి. పవన్ కల్యాణ్ “బంగారం”, “పంజా” సినిమాలు తీసిన తమిళ దర్శకులు కూడా అంతే ఫలితాన్ని అందించారు.
ఇలాంటి కోలీవుడ్ దర్శకులు చేసే సినిమాలు తెలుగు హీరోలకు నిరాశ తెస్తున్నాయి. నాగార్జున, వెంకటేశ్, బాలకృష్ణ, చిరంజీవి కూడా ఇలాంటి అనుభవాలు ఎదుర్కొన్నారు. కొలీవుడ్ డైరెక్టర్లు టాలీవుడ్ హీరోలకి కాస్త శాపంగా మారుతున్నారా అనే అనుమానాలు కలుగుతున్నాయి.
ALSO READ: Daaku Maharaaj OTT రైట్స్ సొంతం చేసుకున్న డిజిటల్ దిగ్గజం!