Oscar 2025 Movies:
97వ అకాడమీ అవార్డ్స్ కోసం మొత్తం 323 ఫీచర్ సినిమాలు పోటీలో ఉన్నాయి. ఈ లిస్టులో భారతదేశం నుంచి ఏడు సినిమాలు బెస్ట్ పిక్చర్ కేటగిరీకి ఎలిజిబుల్ అయ్యాయి. అవి “కంగువా” (తమిళం), “ఆడుజీవితం” (హిందీ), “సంతోష్” (హిందీ), “స్వతంత్ర్య వీర్ సావర్కర్” (హిందీ), “ఆల్ వి ఇమాజిన్ అజ్ లైట్” (మలయాళం-హిందీ), “గర్ల్స్ విల్ బీ గర్ల్స్” (హిందీ-ఇంగ్లిష్), “పుతుల్” (బెంగాళీ).
సూర్య నటించిన “కంగువా” సినిమాపై ఆయనకు చాలా ఆశలు ఉన్నాయి. కానీ బాక్సాఫీస్ వద్ద ఆ సినిమా ఫలితం ఆశించినంతగా రాలేదు. కోలీవుడ్ అతిపెద్ద డిజాస్టర్ లలో ఒకటిగా నిలిచింది. అయితే, ఈ చిత్రం ఇప్పుడు ఆస్కార్ కంటెండర్స్ లిస్ట్‌లో ఉండటం అందరికీ షాక్ ఇచ్చింది.
View this post on Instagram
ఇక బెంగాళీ సినిమా “పుతుల్” గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఇది బెస్ట్ పిక్చర్ కేటగిరీలో ఆస్కార్ నామినేషన్‌కు పరిశీలనలో ఉన్న మొట్టమొదటి బెంగాళీ సినిమా. ఈ సినిమాను ఇందిరా ధర్ దర్శకత్వం వహించి నిర్మించారు.
ఆస్కార్ నామినేషన్ ఓటింగ్ ప్రాసెస్ జనవరి 8 నుంచి 12, 2025 వరకు జరుగుతుంది. ఫైనల్ నామినేషన్లు జనవరి 17, 2025న ప్రకటిస్తారు. ఇక ఆస్కార్ వేడుక మార్చి 2, 2025న డాల్బీ థియేటర్లో గ్రాండ్‌గా జరుగుతుంది.
ఈ అవార్డులలో షార్ట్ ఫిల్మ్స్, మేకప్ & హెయిర్ స్టైలింగ్, ఒరిజినల్ మ్యూజిక్, సౌండ్ డిజైన్, విజువల్ ఎఫెక్ట్స్ వంటి విభాగాలకూ అవార్డులు ఇవ్వనున్నారు. ఆసక్తికరంగా ఈ ఏడాది ఆస్కార్ పోటీలో ఇండియన్ సినిమాలు మంచి గుర్తింపు పొందుతున్నాయి.
ఇప్పటివరకు ఏ సినిమా ఫైనల్ నామినేషన్‌లోకి వస్తుందో చూడాలి. కానీ ఇప్పటికి ఈ కంటెండర్స్ లిస్టులోకి ఏడు భారతీయ చిత్రాలు రావడం గర్వించదగ్గ విషయం.
ALSO READ: చేతినిండా సినిమాలు.. కానీ డిప్రెషన్ లోకి వెళ్ళిన Mahesh Babu హీరోయిన్.. ఎందుకంటే!