Jagan Security:
ఆంధ్రప్రదేశ్లో తనకి భద్రత లేదు అని.. భద్రతను పెంచమంటూ ప్రభుత్వాన్ని ఆదేశించమని.. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ వేసుకున్న సంగతి తెలిసిందే. ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.
ఈ నేపథ్యంలో నెటిజన్లతో పాటు రాజకీయ నాయకులు కూడా పలు రకాలుగా విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర కూడా రియాక్ట్ అయ్యారు. ఉండవల్లి లోని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాసం దగ్గర.. మీడియాతో సమావేశం అయినా కొల్లు రవీంద్ర వై యస్ జగన్ పిటిషన్ మీద కూడా కామెంట్లు చేశారు.
మాజీ ముఖ్యమంత్రిలకు ఎలా అయితే భద్రత ఉంటుందో.. వైయస్ జగన్ కి కూడా అదే స్థాయిలో భద్రత ఇచ్చామని అన్నారు రవీంద్ర. “కానీ జగన్ మాత్రం సీఎం స్థాయిలో భద్రత కావాలని కోరుతున్నారు” అని అన్నారు. “వైయస్ జగన్ కేవలం పులివెందుల ఎమ్మెల్యే మాత్రమే. ఎమ్మెల్యే కి ముఖ్యమంత్రి తరహా సెక్యూరిటీ, ప్రధాని తరహా భద్రత ఉండదు అనే విషయం తెలుసుకోవాలి” అని గుర్తు చేశారు కొల్లు రవీంద్ర.
అసలు ఆంధ్రప్రదేశ్ ప్రజలకే జగన్ నుంచి సెక్యూరిటీ కావాలి అంటూ విమర్శించారు. చంద్రబాబు నాయుడు నేతృత్వంలో టిడిపి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి చూసి వైసిపి నాయకులు పోర్చుకోలేకపోతున్నారు అని రవీంద్ర ఆరోపించారు. వైసిపి నేతల లాగా తప్పుడు సమాచారం ఇవ్వకూడదు అంటూ మంత్రి పేర్ని నాని మీద సెటైర్లు వేశారు.
త్వరలో పేర్ని నాని కి రెండు బుక్ పవర్ ఏంటో తెలుస్తుంది అని హెచ్చరించారు. అతను చేసిన పాపాలు అన్నిటికీ మూల్యం చెల్లించాల్సిన సమయం వచ్చిందని చెప్పారు. మరోవైపు వైయస్ జగన్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తన భద్రత తగ్గించింది అని పిటిషన్ దాఖలు చేశారు కానీ.. అలాంటిదేమీ లేదు అని అధికారులు చెబుతున్నారు.