కోయిలమ్మ సీరియల్ హీరో అమర్‌ను రాయదుర్గం పోలీసులు అరెస్టు చేశారు. కొంత కాలం క్రితం స్నేహితులతో కలిసి మద్యం సేవించి… ఇద్దరు మహిళలపై సమీర్ దాడికి పాల్పడినట్టు రాయదుర్గం పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. 5 లక్షల రూపాయలు తీసుకుని… తిరిగి చెల్లించమని అడిగినందుకు సమీర్ తమపై దాడి చేశాడంటూ బాధితులు ఫిర్యాదు చేశారు. మణికొండలోని తమ ఇంటికి అనుచరులతో వచ్చి గొడవ చేశాడని కంప్లైంట్ ఇచ్చారు. దీంట్లో తన తప్పేమీ లేదని అమీర్ చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలో రాయదుర్గం పోలీసులు అమర్‌ను బుధవారం అరెస్టు చేశారు. కూకట్పల్లి కోర్టు అతనికి రిమాండ్ విధించడంతో అమర్‌ను చర్లపల్లి జైలుకు తరలించారు. ఈ కేసుపై పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేపడుతున్నారు.