కరోనా వైరస్ వ్యాప్తి నివారణ కోసం భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ, అతని భార్య అనుష్క శర్మ ముంబై పోలీసు సిబ్బంది సంక్షేమం కోసం ఒక్కొక్కరు రూ .5 లక్షల చొప్పున మొత్తం 10 లక్షలు అందించారని ముంబై పోలీసు కమిషనర్ పరమ్ బిర్ సింగ్ తెలియజేశారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేసారు కమిషనర్. అందులో… “ముంబై పోలీసు సిబ్బంది సంక్షేమం కోసం ఒక్కొక్కరు రూ .5 రూపాయలు అందించినందుకు ధన్యవాదాలు, కోహ్లీ మరియు అనుష్కశర్మ… మీ సహకారం కరోనా వైరస్ కు వ్యతిరేకంగా పోరాటంలో ముందున్న వారిని కాపాడుతుంది” అంటూ తెలిపాడు. అయితే అంతకుముందు, కరోనా కు వ్యతిరేకంగా పోరాటానికి మద్దతుగా కోహ్లీ మరియు అనుష్క పిఎం కేర్స్ ఫండ్ మరియు మహారాష్ట్ర ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్ కు విరాళం అందించిన విషయం తెలిసిందే. అయితే అప్పుడు వారు ఎంత అందించారు అనే విషయాన్ని మాత్రం తెలుపలేదు. ఇక మన దేశంలో అత్యధికంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు మహారాష్ట్రలో ఉన్నాయి.