అదేంటి.. రెజీనాకు ఇంకా పెళ్లి కూడా కాలేదు కదా! కొడుకు ఎక్కడ నుండి వచ్చాడు అనుకుంటున్నారా..?
తెలుగు, తమిళ బాషల్లో మంచి నటిగా ఇప్పుడిప్పుడే గుర్తింపు తెచ్చుకుంటున్న ఈ భామ నిజంగానే
తళ్ళయింది. అయితే అది నిజ జీవితంలో కాదు.. రీల్ లైఫ్ లో.. ప్రస్తుతం రెజీనా తమిళంలో ‘నెంజమ్ మరప్పతిల్లై’
అనే సినిమాలో నటిస్తోంది. ఎస్.జె.సూర్య నటిస్తోన్న ఈ చిత్రానికి సెల్వ రాఘవన్ దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు.
తాజాగా ఈ సినిమా ట్రైలర్ బయటకి వచ్చింది. ఈ సినిమాలో రెజీనా ఓ బాబుకి తల్లిగా కనిపించనుంది. అలాగే ఈ
సినిమాలో ఆమె దయ్యం పాత్రలో కూడా కనిపించి ప్రేక్షకులను బయపెట్టబోతోంది. కథ విషయానికి వస్తే.. రెజీనా,
సూర్యలు భార్యాభర్తలు. కొన్ని కారణాల వలన రెజీనా హత్యకు గురవుతుంది. సూర్య రెండో పెళ్లి చేసుకుంటాడు.
ఆ తర్వాత తన బిడ్డ కోసం రెజీనా ఆత్మగా తిరిగి వస్తుంది. అసలు రెజీనా ఎందుకు హత్యకు గురయింది..? తనను
హత్య చేసిన వారిపై ఆమె ఎలా ప్రతీకారం తీర్చుకుంది..? అనే అంశాలతో సినిమా నడుస్తుంది. అసలు మ్యాటర్ ఇది.