Jr ntr: తారక్ కు NTR ఘాట్ వద్ద ఘోర అవమానం ఎదురైన సంగతి తెలిసిందే. హైదరాబాద్ ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఏర్పాట్టు చేసిన జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలను తొలగించారు. బాలకృష్ణ ఆదేశాల మేరకు జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలను తొలగించినట్లు తెలుస్తోంది.
బాలయ్య అనుచరులే ఈ పని చేశారు అని టాక్. బాలకృష్ణ అక్కడికి వచ్చి వెళ్లిన మరు క్షణమే ఎన్టీఆర్ ఫ్లెక్సీలను తొలగించారు. దీనిపై ఇప్పటికే ఎన్టీఆర్ ఫ్యాన్స్ మండిపడుతుంటే.. తాజాగా ఈ వివాదానికి పొలిటకల్ సెగ తగిలింది.
ఎన్టీఆర్ ఘాట్ వద్ద జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు తొలగింపు గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నారా లోకేష్ కోసం జూనియర్ ఎన్టీఆర్ ను సర్వనాశనం చేసే ప్రయత్నం చేస్తున్నారని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. వాళ్లది నీచాతి నీచమైన బుద్ధి అని.. వెయ్యి మంది బాలకృష్ణలు, చంద్రబాలు వచ్చినా జూనియర్ ఎన్టీఆర్ ని ఏం చేయలేరు.
జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు తొలగించినంత మాత్రాన ఏమీ చేయలేరు. ఎన్టీఆర్ కి వెన్నుపోటు పొడిచిన వారు ఎన్టీఆర్ వర్థంతి చేస్తారా..? నాని మండి పడ్డారు. గుడివాడలోని ఎన్టీఆర్ స్టేడియంలో ఎన్టీఆర్ విగ్రహానికి కొడాలి నాని నివాళి అర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఆయన పైవ్యాఖ్యలు చేశారు.