మెగాస్టార్ చిరంజీవి మోకాలికి శస్త్ర చికిత్స జరిగింది. దేశ రాజధాని న్యూఢిల్లీలో మోకాలికి చిన్న ఆపరేషన్ చేయించుకున్నారు. దీంతో చిరంజీవి వారం రోజుల పాటు ఢిల్లీలోనే విశ్రాంతి తీసుకోనున్నారు. ఆ తర్వాత హైదరాబాద్ తిరిగి వస్తారు.
చిరంజీవికి నీ-వాష్ సర్జరీ చేసినట్లుగా తెలుస్తోంది. మోకాలిలో ఉన్న ఇన్ఫెక్షన్ను ఈ ఆపరేషన్ ద్వారా ఆర్థోప్లాస్టీ చేసి క్లియర్ చేస్తారు. ఈ నెల 22వ తేదీన చిరంజీవి పుట్టిన రోజు. అదే రోజున చిరంజీవి కొత్త సినిమా ప్రారంభం కానుంది. ఈ సినిమాకి చిరంజీవి కూతురు సుష్మిత నిర్మాతగా వ్యవహరించగా, కల్యాణ్ కృష్ణ దర్శకత్వం వహస్తున్నారు.