యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన తాజా చిత్రం ‘సెబాస్టియన్ పిసి 524’. బాలాజీ సయ్యపురెడ్డి డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమాని లైట్ ఎంటర్‌టైన్‌మెంట్ సమర్పణలో సిద్ధారెడ్డి బి, జయచంద్రా రెడ్డి, రాజు, ప్రమోద్ నిర్మించారు. కోమలీ ప్రసాద్, నువేక్ష (నమ్రతా దరేకర్) హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా మార్చి 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా మూవీ ప్రమోషన్ కార్యక్రమాలను శరవేగంగా జరుపుకుంటోంది మూవీ యూనిట్.
ఈ నేపథ్యంలో ఈ రోజు(ఫిబ్రవరి 28) ఈ మూవీ ట్రైలర్ విడుదల చేశారు మేకర్స్. సోమవారం హీరో విజయ్ దేవరకొండ ఈ మూవీ ట్రైలర్‌ను విడుదల చేశారు. కాగా ఆర్థిక సమస్యలు, కష్టాలతో పెరిగిన హీరో పోలీసు ఆఫీసర్ ఎలా అయ్యాడు. ఈ క్రమంలో ఓ మర్డర్ కేసులో ఆరోపణలు ఎదుర్కొని సస్పెండ్ అయిన హీరో చీకట్లో ఈ కేసును ఎలా చేదించాడు వంటి ఆసక్తికర సన్నివేశాలతో మలిచారు. ఈ ట్రైలర్ సినిమాపై హైప్ క్రియేట్ చేసింది.