కిరణ్ అబ్బవరం హీరోగా నటిస్తున్న తాజా సినిమాకి ‘నేను మీకు బాగా కావాల్సినవాడిని’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఇందులో సంజనా ఆనంద్ హీరోయిన్‌గా నటిస్తుంది. దివంగత ప్రముఖ దర్శకులు కోడి రామకృష్ణ కుమార్తె కోడి దివ్య ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
కార్తీక్ శంకర్ దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను బుధవారం విడదుల చేశారు. ‘ఫ్యామిలీ ఆడియన్స్ మెచ్చేలా ఈ సినిమా ఉంటుంది’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.