మెగాస్టార్ చిరంజీవి అల్లుడు కల్యాణ్‌దేవ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘కిన్నెరసాని’. క్రైమ్, సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో రవీంద్రవిజయ్ కీలకపాత్ర పోషించారు. తాజాగా గురువారం ఉదయం ఈమూవీ ట్రైలర్‌ను చిత్రబృందం సోషల్‌మీడియా వేదికగా విడుదల చేసింది. ఈ ట్రైలర్ ఆద్యంతం ఉత్కంఠగా సాగింది. ముఖ్యంగా కల్యాణ్‌దేవ్, రవీంద్ర విజయ్‌ల నటన ఆకట్టుకునేలా సాగింది. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోన్న ఈ చిత్రం జనవరి 26న విడుదల కానుంది. రమణ తేజ డైరెక్షన్‌లో వస్తున్న ఈ చిత్రానికి రజనీ తాలూరి, రవి చింతల నిర్మాతలుగా వ్యవహరించారు.