కరోనా నేపధ్యంలో ప్రముఖ కన్నడ హీరో కిచ్చా సుదీప్ పేద విద్యార్థుల కోసం ముందుకు వచ్చాడు. సినిమాల ద్వారా స్టార్ హీరో అనిపించుకన్న ఈ నటుడు..ఇపుడు రియల్ హీరో కూడా అనిపించుకున్నాడు. కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లాల్లో తన చారిటబుల్ ట్రస్ట్ ద్వారా 4 ప్రభుత్వ పాఠశాలలను సుదీప్ దత్తత తీసుకున్నాడు. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించేలా స్కాలర్ షిప్ ప్రోగ్రామ్స్ నిర్వహించడంతోపాటు వారికి డిజిటల్ క్లాస్ రూమ్‌లను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు వాలంటీర్స్ టీమ్‌తో కలిసి
సన్నాహాలు చేశాడు.
సుదీప్ స్కూళ్లున్న ప్రాంతాలు, అక్కడున్న వసతులు, ఇతర అంశాలను స్టడీ చేసేందుకు ఇప్పటికే వాలంటీర్లను ఆయా ప్రాంతాలకు పంపిచాడు. అక్కడున్న సమాచారం మొత్తాన్ని సేకరించాడు. సుదీప్ ఇదంతా చాలా గోప్యంగా చేస్తున్నట్లు సమాచారం. తన నటనతో కన్నడతోపాటు తెలుగు, తమిళ, హిందీ భాషల్లో కూడా నటించి మంచి గుర్తింపు పొందాడు సుదీప్.