HomeTelugu Trendingఎన్టీఆర్‌తో కియారా రొమాన్స్‌!

ఎన్టీఆర్‌తో కియారా రొమాన్స్‌!

Kiara Advani with NTR
జూనియర్‌ ఎన్టీఆర్‌, త్రివిక్రమ్‌ కాండినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ‘అరవింద సమేత’ తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌ రానున్న రెండో చిత్రం కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. కాగా ఈ సినిమాలో ఎన్టీఆర్‌కు జంటగా ఎవరు నటించనున్నారు అనే విషయం నెటిజన్‌ల్లో ఆసక్తికరంగా మారింది. ఎన్టీఆర్‌ 30వ చిత్రంగా రానున్న ఈ సినిమాలో రష్మిక ఆడి పాడనుందంటూ మొదట్లో ప్రచారం సాగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా బాలీవుడ్‌ నటి కియారా అద్వాణీ పేరు కూడా వినిపిస్తోంది.

విభిన్న కథాచిత్రంగా తెరకెక్కనున్న ఈ సినిమాలో తారక్‌ సరసన కియారా ఆద్వాణీ అయితే బాగుంటుందని త్రివిక్రమ్‌ భావించారట. ఈ మేరకు సంప్రదింపులు చేయగా.. ఆమె కూడా సముఖత వ్యక్తం చేసినట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో ప్రస్తుతం ఎన్టీఆర్‌-కియారా జోడీ గురించి నెటిజన్లు చర్చించుకుంటున్నారు. అయితే దీనిపై ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu