భరత్ అనే నేను, వినయ విధేయ రామ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన నటి కియారా అద్వానీ. 2014లో ఫగ్లీ అనే సినిమాతో తెరంగేట్రం చేసింది కియారా. వచ్చే ఏడాదితో పదేళ్లు కెరీర్ పూర్తిచేసుకోబోతుంది కియారా అద్వానీ.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్ గురించి పలు విషయాలు ముచ్చటించింది. నాతో కలిసి పనిచేయాలనుకునే వారు నన్ను దృష్టిలో పెట్టుకుని స్ర్కిప్ట్ సిద్ధం చేస్తున్నారన్న విషయం తెలిసి నాకు చాలా ఆనందంగా ఉంది అంటోంది.
మొదటి నుంచి నా సినిమాల ఎంపిక విషయంలో ఎలాంటి మార్పులేదు. నాలుగు రకాల కథలకు బదులు 10 రకాల స్ర్కిప్ట్‌లు ఎంచుకుంటున్నాను అని చెప్తోంది.
కథల ఎంపికలో చాలా జాగ్రత్తలు తీసుకుంటాను. సినిమా చేయడం అంటే పెద్ద కమిట్‌మెంట్. కథలో బలం ఉందా లేదా అని చూస్తాను. సినిమా అంటే తెర వెనుక ఎంతోమంది కష్టం, కృషి ఉంటుంది. సినిమా విజయవంతం అయినా, కాకున్నా అది లైఫ్‌లో అనుభవంలా భావిస్తాను.
తొలి నాళ్లలో కథల ఎంపికలో ఎన్నో విమర్శలను ఎదుర్కొన్నాను. ఏదైనా భిన్నంగా చేయాలనే ఆలోచనతో నిర్ణయాలు తీసుకుంటాను. లస్ట్ స్టోరీస్, కబీర్ సింగ్ సినిమాల్లో పాత్రలకు ప్రశంసలతో పాటు విమర్శలు కూడా వచ్చాయని అంది కియారా. ఆ పాత్రలు తనకు చాలా సంతృప్తి నిచ్చాయని అంటోంది.